లాభాల్లోకి స్పైస్‌జెట్..
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత స్పైస్‌జెట్ విమానయాన సంస్థ లాభాల బాట పట్టింది. 2013-14 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.322 కోట్ల నష్టాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.22.5 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. అయితే ఆదాయం మాత్రంరూ.1,300 కోట్ల నుంచి 40 శాతం క్షీణించి రూ.786 కోట్లకు తగ్గిందని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. ఇక ఇబిటా రూ.235 కోట్ల (ప్రతికూలం)నుంచి రూ.80 కోట్లకు చేరిందని వివరించారు. విమానాల లోడ్ ఫ్యాక్టర్ 81 శాతంగా ఉందని వివరించారు. కాగా ఈ సంస్థలో ఇప్పటివరకూ కొత్త ప్రమోటర్ (అజయ్ సింగ్)నూ. 650 కోట్లు పెట్టుబడులు పెట్టారు.