సాక్షి, ముంబై: లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లో మంగళవారం టాటా స్టీల్ ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ స్టీల్ పెన్షన్ పథకానికి(బీఎస్‌పీఎస్)కు యూకే పెన్షన్ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన వార్తలతో టాటా స్టీల్ షేర్ భారీ లాభాలను నమోదు చేసింది. బ్రిటిష్ పెన్షన్ రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభించిందని టాటాస్టీల్ ఒక ప్రకటనలో ధృవీకరించింది.
యూకే అనుబంధ సంస్థ టాటా స్టీల్, తదితర అనుబంధ సంస్థల నుంచి బీఎస్‌పీఎస్‌ను విడదీసేందుకు యూకే పెన్షన్ రెగ్యులేటర్ అనుమతించినట్లు దేశీ దిగ్గజం టాటా స్టీల్ పేర్కొంది టాటాస్టీల్ (యూకే) ద్వారా (బబీఎస్‌పీఎస్) 550 మిలియన్ పౌండ్లను చెల్లించినట్టు తెలిపింది. ఇది కంపెనీలోని 33 శాతం వాటాకి సమానమైన భాగాన్ని బీఎస్‌పీఎస్ ట్రస్టీకి జారీ చేశామని ఉక్కు దిగ్గజం తెలిపింది. మరోవైపు ఈ నెలలోనే టాటా స్టీల్‌తో యూరోపియన్ స్టీల్ బిజినెస్ విలీనానికి థిస్సెన్‌క్రుప్ ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఈ వార్తలతో టాటా స్టీల్ కౌంటర్లో కొనుగోళ్ళ జోరునెలకొంది. 3శాతంపైగా లాభాలతో ఆరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది.
దూసుకుపోతున్న టాటా స్టీల్
Published Tue, Sep 12 2017 11:20 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
Advertisement