
లండన్ : టాటా స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానప్రకారం) భారీ పేలుడు చోటుచేసుకుంది. పోర్ట్ టాల్బెట్‌లోని టాటా స్టీల్ వర్క్స్‌లో పేలుడు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరికి గాయాలైనట్టు సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.