గతవారం బిజినెస్ | last week business news | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Nov 28 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

గతవారం బిజినెస్

గతవారం బిజినెస్

టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఔట్
చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్చేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్‌‌స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం వరకూ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. 

 మూడోసారి వేలానికి ’కింగ్‌ఫిషర్’ భవనం
కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15% తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు.ముంబైలోని విమానాశ్రయం సమీపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది.

రికార్డు కనిష్టానికి రూపారుు
డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్‌తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తదితర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. 

భారత్‌లో సంపద అసమానత్వం అధికం
భారత్‌లో సంపద విషయమై అసమానత్వం అధికంగా ఉందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్-2016 తెలిపింది. మొత్తం జనాభాలో ఒక్క శాతం మంది దగ్గరే మొత్తం సంపదలో 60 శాతం ఉందని క్రెడిట్  సూచీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో సంపన్న పేదరికం ఉందని వివరించింది. జనాభాలో 96 శాతం మందికి పైగా పదివేల డాలర్లు (రూ.6,80,000)లోపు సంపద ఉన్నవారేనని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో  సంపద విషయంలో అసమానత్వం అధికంగా ఉన్న రెండో దేశం భారత్ అని వివరించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నా, ఈ వృద్ధిలో అందరికి భాగస్వామ్యం ఉండడం లేదని పేర్కొంది.

జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2%!
దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు. మొబైల్ తయారీ యూనిట్లు గత రెండేళ్లలో 38,300 ఉద్యోగాలను అందించినట్టు పేర్కొంది. 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్య కాలంలో టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది.

 ఎస్‌బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు 1.9% తగ్గింపు
బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని ఎస్‌బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను 6 శాతం నుంచి 4.25 శాతానికి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్‌బీఐ తెలిపింది.

 ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు షురూ!
టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్‌లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్‌లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది.

2,071 మంది.. 3.89 లక్షల కోట్లు బకారుులు దేశంలో 2,071 మంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ.3,88,919 కోట్ల రుణాలు వసూలు కాని మొండి బకారుులు (ఎన్‌పీఏ)గా మారినట్టు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు మంగళవారం వెల్లడించారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒక్కొక్కరు రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారేనని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.50 కోట్లకు మించిన ఎన్‌పీఏ ఖాతాలు 2,071గా ఉన్నాయని పేర్కొన్నారు.

డీల్స్..
మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ చానళ్లలో 100% వాటాతో పాటు రిలయన్‌‌స రెడియో వ్యాపారంలో 49% వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,900 కోట్లు.

దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్మా కంపెనీ జేఎస్‌సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. బయోసింటెజ్‌లో 85.1% వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement