టాటా స్టీల్‌కు డీమోనిటైజేషన్ సెగ
జంషెడ్‌పూర్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమ వ్యాపార కార్యకలాపాలపై గణనీయంగానే ఉందని టాటా స్టీల్ వెల్లడించింది. అయితే, ఇది తాత్కాలికమే కాగలదని.. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడగలవని సంస్థ ఎండీ (భారత్, ఆగ్నేయాసియా) టీవీ నరేంద్రన్ తెలిపారు. డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. జంషెడ్‌పూర్, కళింగనగర్‌లలోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి యథాప్రకారమే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
నగదు ఆధారిత గ్రామీణ మార్కెట్లలో డీమోనిటైజేషన్ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీల ప్రతిపాదనకు తోడ్పాటునిచ్చేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్ మెషీన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు నరేంద్రన్ వివరించారు.