న్యూఢిల్లీ: నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌ఐఎన్‌ఎల్)ను స్వాదీనం చేసుకున్న తర్వాత వార్షిక తయారీ సామర్థ్యాన్ని ఏడాదిలోనే 1.1 మిలియన్ టన్నులకు చేరుస్తామని టాటా స్టీల్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఇది ఆధారపడి ఉంటుందన్నారు. టాటా స్టీల్ 115వ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడారు. జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదతర సంస్థలతో పోటీపడి ఎన్‌ఐఎన్‌ఎల్‌ను టాటా స్టీల్‌కు చెందిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ దక్కించుకోవడం తెలిసిందే. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో 93.71 శాతం వాటాకు టాటా స్టీల్ వేసిన రూ.12,100 కోట్ల బిడ్ అర్హత సాధించింది.
లాంగ్ ప్రొడక్ట్స్, మైనింగ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ విభాగంలో గణనీయమైన కొనుగోళ్లు చేసినట్టు చంద్రశేఖరన్ చెప్పారు. తమ కళింగనగర్ ప్లాంట్‌కు ఎన్‌ఐఎన్‌ఎల్ సమీపంలో ఉండడం తమకు ఎంతో కీలకమైనదంటూ.. అందుకే కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి ఇది కేంద్రంగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment