నిఫ్టీ మరో కొత్త రికార్డు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం ట్రేడింగ్‌లో 18 పాయింట్లు పుంజుకుని తొలిసారి 8,363 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 35 పాయింట్లు బలపడి 27,910 వద్ద నిలిచింది. సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలై గరిష్టంగా 27,996ను తాకింది.
ఆపై అమ్మకాలు పెరిగి మిడ్‌సెషన్‌లో 27,790 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌లో ప్రధానంగా ఎంఅండ్‌ఎం 2.5% పుంజుకోగా, టాటా స్టీల్, గెయిల్, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే మరోవైపు బీహెచ్‌ఈఎల్ 2.5% పతనంకాగా, ఐటీసీ, భారతీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా 2-1% మధ్య నష్టపోయాయి. కాగా, రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, ఒబెరాయ్, డీబీ, ఇండియాబుల్స్ 3.5-1.5% మధ్య పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,579 లాభపడగా, 1,433 నష్టపోయాయి.
మరిన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలు రావాలి: బీఎస్‌ఈ ఎండీ
న్యూఢిల్లీ: దేశీ పొదుపు సొమ్మును ఉత్పత్తికారక పెట్టుబడులుగా మార్చేందుకు వీలుగా మరిన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెరలేపాలని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ సూచించారు. క్యాపిటల్ మార్కెట్ల వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ సూచన చేశారు.
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ
డీఐఐ 11-11 1,181 1,698 - 517
10-11 1,435 1,750 -315
7-11 1,818 2,011 192
ఎఫ్‌ఐఐ 11-11 4,444 3,986 458
10-11 4 ,292 3,936 355
7-11 8,091 5,554 2,537
(విలువలు రూ.కోట్లలో)