సెన్సెక్స్ @ 28,000
అంతర్జాతీయ స్థాయిలో మరోసారి దిగివచ్చిన ముడిచమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి ప్రధాన ఇండెక్స్‌లు మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ 28,000 పాయింట్ల మైలురాయికి ఎగువన ముగియగా, ఇంట్రాడేలో నిఫ్టీ 8,400ను దాటేసింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి కొత్త గరిష్టాలుకాగా, 99 పా యింట్లు లాభపడ్డ సెన్సెక్స్ తొలిసారి 28,009 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 21 పాయింట్లు పెరిగి 8,383 వద్ద నిలిచింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 28,126ను, నిఫ్టీ 8,415 పాయింట్లను అధిగమించడం విశేషం! బ్రెంట్ చమురు 80 డాలర్లకు, నెమైక్స్ రకం 76 డాలర్లకు పడిపోవడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. చమురు ధర భారీగా క్షీణించడంతో దిగుమతుల బిల్లు తగ్గి ద్రవ్యలోటు కట్టడికి వీలుచిక్కుతుందన్న ఆశలు ఇందుకు దోహదపడినట్లు తెలిపారు.
ఇతర విశేషాలివీ...
ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మార్కెట్లకు అండగా నిలిచాయి.
సెన్సెక్స్ దిగ్గజాలలో యాక్సిస్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, హీరోమోటో, ఐసీఐసీఐ 3-1.5% మధ్య పుంజుకున్నాయి.
మిగిలిన బ్లూచిప్స్‌లో సిప్లా, టాటా పవర్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా 3-1% మధ్య నీరసించాయి.
మిడ్ క్యాప్స్‌లో గతి, బేయర్ క్రాప్, ఉషా మార్టిన్, యూఫ్లెక్స్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఏఐఏ ఇంజినీంగ్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, అశోక్ లేలాండ్, జిల్లెట్, ఫినొలెక్స్ కేబుల్స్ 17-7% మధ్య పెరిగాయి.
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ
డీఐఐ 12-11 1,250 1,809 -559
11-11 1,181 1,698 -517
10-11 1,435 1,750 -315
ఎఫ్‌ఐఐ 12-11 4,113 3,653 459
11-11 4,444 3,986 458
10-11 4,292 3,936 355
(విలువలు రూ.కోట్లలో)