ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్‌లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు.
ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది.
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
Published Tue, May 16 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
Advertisement