Q4 loss
-
జీఎంఆర్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యుత్, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2018–19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జీసీఈఎల్), దీని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించి రూ.969 కోట్ల నష్టం కూడా తోడైంది. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.2,212 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.5 కోట్ల లాభం రావడం గమనార్హం. ఇక మార్చి క్వార్టర్‌కు మొత్తం ఆదాయం రూ.2,293 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,234 కోట్లుగా ఉంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆదాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల ట్రాఫిక్ 2018–19లో 5 శాతం పెరిగి 69.2 మిలియన్లుగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల ట్రాఫిక్ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా నమోదైంది. ఇంధన విభాగంలో తాజా పెట్టుబడుల్లేవు ‘‘ఇంధన విభాగంలో మా వాటాదారుల పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రారంభ పెట్టుబడిని మాఫీ చేశాం. నియంత్రణ పరిస్థితులు మరింత స్పష్టంగా మారి, మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ ఈ దశలో ఇంధన విభాగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోవడం లేదు. సరైన సమయంలో పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది’’అని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చావ్లా తెలిపారు. ఇటీవల టాటా గ్రూపు, జీఐసీ సింగపూర్, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్తో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ఎయిర్పోర్ట్ వ్యాపారం డీమెర్జింగ్‌కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో సురేష్ బాగ్రోడియా చెప్పారు. రుణభారం ప్రస్తుత రూ.24,000 కోట్ల నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తగ్గిపోతుందన్నారు. విమానాశ్రయాల్లో సామర్థ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. -
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది. -
క్యూ4 లో ఓబీసీకి భారీ నష్టాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. క్యూ4లో రూ.1,218 కోట్ల రూపాయలను ఆర్జించింది. విశ్లేషకుల అంచనాలతో పోల్చితే రూ. 77.4 కోట్లు నష్టం. క్యూ4లో రూ. 18 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1,086.5 కోట్ల రూపాయల నికర లాభాలు ఆర్జించగా .. అంతకు ముందు త్రైమాసికంలో రూ.1,429.6 కోట్లుగా ఉంది. ఎసెట్ క్వాలిటీని మెరుగుపర్చకున్నప్పటికీ ప్రొవిజన్లు మాత్రం 3 శాతం జంప్ చేసి రూ.3,050కు పెరిగాయి. గత ఏడాది ఇవి రూ.1,086లుగాఉన్నాయి. ఇతర ఆదాయాలు, వడ్డీ కాని ఆదాయాలు 20 శాతం పెరిగి రూ .590.98 కోట్లు, ఆపరేటింగ్ లాభం 15.75 శాతం పెరిగి రూ .1017.13 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం, వడ్డీని సంపాదించిన వడ్డీ మరియు వ్యయం మధ్య వ్యత్యాసం, 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3.4 శాతం పెరిగి 1,307.3 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు 2.14 శాతం నుంచి 2.54 శాతానికి పెరగడం విశేషం. నిరర్ధక ఆస్తులు 13.7 శాతం నుంచి 13.8 శాతాన్ని నమోదుచేశాయి. ఈ ఫలితాలో నేపథ్యంలో బిఎస్ఇలో 7శాతానికిపైగా కుప్పకూలింది. -
ఆ బ్యాంకునూ భారీగా ముంచేసిన బకాయిలు
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ కు భారీ షాకింగ్. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అతిపెద్ద క్వార్టర్ నష్టం. ఒక్కసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఢమాల్ మని పడిపోయింది. బుధవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.5,370 కోట్ల భారీ నష్టాలను నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.307 నికల లాభాలను చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ ఏడాది మార్కెట్ విశ్లేషకులకు షాకిస్తూ భారీ నష్టాల్లో నిలిచింది. ఈ ఏడాది రూ.81కోట్ల లాభాలను నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే వీరి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో 12.9 శాతానికి ఎగబాకడంతో, నష్టాలు వాటిల్లాయని బ్యాంకు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ బకాయిలు 8.47శాతంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో ఉన్న రూ.34,338 కోట్ల మొండిబకాయిలు, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.55,818 కోట్లకి ఎగబాకాయి. స్థూల మొండి బకాయిలు త్రైమాసికం త్రైమాసికానికి రూ.21,480 కోట్లు పెరిగాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని బ్యాంకుల మొండి బకాయిల కన్నా ఈ బకాయిలే ఎక్కువ. మూడో అతిపెద్ద పబ్లిక్ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు నికర నష్టాల దలాల్ స్ట్రీట్ ను షాకుకు గురిచేసింది. పీఎన్బీ ఫలితాల అనంతరం, మొత్తం 18 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకుల మార్చి క్వార్టర్ నష్టాలు ఏకంగా రూ.14,808 కోట్లని గణాంకాలు విడుదలయ్యాయి. బ్యాంకులు నమోదుచేస్తున్న ఈ నష్టాలతో పీఎస్ యూ బ్యాంకింగ్ రంగం మార్కెట్లో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఈ నెలలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 6శాతం మేర పడిపోయింది