narrows
-
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్ సాధించింది. ఏఆర్పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్కాగా.. మూడేళ్ల కాలంలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గిన నష్టం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెలువరించింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం స్వల్పంగా తగ్గి రూ. 495 కోట్లకు పరిమితమైంది. అధిక విక్రయాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 524 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 873 కోట్ల నుంచి రూ. 1,214 కోట్లకు ఎగసింది. వాహన విక్రయాలు 74 శాతం జంప్‌చేసి 98,619 యూనిట్లను తాకాయి. 2025 మార్చికల్లా కంపెనీ 2,000 సొంత ఔట్లెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌కల్లా 782 స్టోర్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 73 వద్ద ముగిసింది. -
అమానుషం: నన్నే ఆపుతారా అంటూ... కారుతో తొక్కించి....
ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్‌తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్ మాత్రం కోపంతో యాక్సిలరేటర్ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో వైరల్ అవుతోంది. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నష్టం రూ.352 కోట్లుగా ఉంటే, తాజాగా అది రూ.67 కోట్లకు పరిమితమైంది. అయితే ఏ రూపంలో నష్టాలు తగ్గాయన్న? సందేహం రావచ్చు. కంపెనీ ఫిట్సో అనే ప్లాట్ఫామ్లో తనకున్న వాటాలను విక్రయించింది. ఈ రూపంలో రూ.316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ.383 కోట్ల నష్టం కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. కస్టమర్ డెలివరీ చార్జీలు తగ్గించడం, కరోనా తర్వాత రీఓపెనింగ్ ప్రభావం, డెలివరీ నుంచి రెస్టారెంట్ డైనింగ్ అవుట్‌కు కొంత వ్యాపారం బదిలీ కావడం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) వృద్ధి బలహీనంగా ఉండడానికి దారితీసినట్టు జొమాటో వివరించింది. జీవోవీ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం అధికంగా, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.7 శాతం పెరిగి రూ.5,500 కోట్లుగా ఉంది. మరింత విస్తరణే లక్ష్యం ‘‘దీర్ఘకాలంలో ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం వృద్ధి పట్ల పెద్ద అంచనాలతోనే ఉన్నాం. రెస్టారెంట్ పరిశ్రమలో మార్పులకు అందిస్తున్న సహకారం ద్వారా జొమాటో ప్రయోజనం పొందుతుంది’’ అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. మరిన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న తీరుపై స్పందిస్తూ.. తమ వ్యాపారం వృద్ధిని వేగవంతం చేసే వ్యాపారాల్లో మైనారిటీ వాటాల కొనుగోలుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ బ్యాలన్స్ షీటులో 1.7 బిలియన్ డాలర్లు ఉన్నాయని, నిధుల సమీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో అర్బన్పైపర్లో 5 మిలియన్ డాలర్లు, అడోన్మోలో 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు బ్లింకిట్ (గ్రోఫర్), షిప్‌రాకెట్, క్యూర్‌ఫిట్ తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది. -
జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్‌టెల్‌తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్‌తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది. -
నష్టాలను తగ్గించుకున్న అదాని పవర్
న్యూఢిల్లీ: అదానీపవర్ ఏకీకృత నికర లాభం స్వల్పంగా తగ్గింది. సోమవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అదానీ పవర్ లిమిటెడ్ రూ.114 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది రూ. 411 కోట్ల నికర నష్టాలను చవిచూసినట్టు కంపెనీ బీఎసీఈ ఫైలింగ్ లో తెలిపింది. గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదాని పవర్ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.5776 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇది రూ.5,751 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు రూ.4,533 కోట్లుగా ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో విరివిగా అందుబాటులోకి వస్తున్న విద్యుత్ ఉత్పత్తి ఒక కీలకమైన అంశమని అదానీ పవర్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. 2016-17 ఆర్థికసంవత్సరానికి అన్ని ప్లాంట్లలో మరింత వృద్ధిని సాధించే అవకాశంఉందని అదానీ సీఈవో బనీత్ జైన్ చెప్పారు. కార్యనిర్వాహక సామర్ధ్యం మెరుగుదల, ఫైనాన్స్ వ్యయం, సమర్థవంతమైన కార్యకలాపాలు నేపథ్యంలోతాజా త్రైమాసికంలో నికర నష్టాలు గణనీయంగా తగ్గడానిక సాయపడ్డాయన్నారు.