సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ కూడా ఉద్యోగాలను తీసివేసే పనిలో పడింది. సంస్థ పునర్నిర్మాణంతోపాటు, ఖర్చులను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూరోపియన్ యూనిట్లలో భారీగా ఉద్యోగులను తొలగించనుంది. బలహీన డిమాండ్, అధిక వ్యయాలతో కుస్తీలు పడుతున్న సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ ఆడమ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీన్ని ధృవీకరించిన టాటా స్టీల్ తీవ్రమైన మార్కెట్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని, కార్బన్-న్యూట్రల్ స్టీల్ మేకింగ్ వైపు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ మార్పులు అవసరమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
సుమారు 3 వేలమందికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ఐరోపాలో ఉక్కు తయారీ అంతర్జాతీయ పోటీ, అధిక ఇంధన వ్యయాల ఒత్తిడి నేపథ్యంలో భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. మొత్తం తాజా కోతలో మూడింట రెండు వంతుల మంది వైట్ కాలర్ ఉద్యోగాలంటాయని అంచనా. యూరోపియన్ వ్యాపారంలో మొత్తం 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment