Europe Markets
-
మారిన ఐటీ కంపెనీల ఫోకస్
ముంబై, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో కొద్ది రోజులుగా యూరోపియన్ మార్కెట్లవైపు దృష్టి సారించాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతాల నుంచి భారీ డిల్స్‌ను పొందడంతో రూటు మార్చినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేశీ ఐటీ కంపెనీలు యూఎస్ నుంచే అత్యధిక కాంట్రాక్టులు సంపాదిస్తుంటాయి. దీంతో ఆదాయంలో యూఎస్ 70 శాతం వాటా వరకూ ఆక్రమిస్తుంటుంది. అయితే ఇటీవల దేశీ కంపెనీలు యూరోపియన్ ప్రాంత కంపెనీలను కొనుగోలు చేస్తుండటం కూడా వ్యూహాల మార్పునకు కారణమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) కోవిడ్-19 ఎఫెక్ట్ ఏడాది కాలంగా ప్రపంచాన్ని.. ప్రధానంగా యూరోపియన్ దేశాలను కోవిడ్-19 మహమ్మారి వణికిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వని యూరోపియన్ మార్కెట్లు ఇతర దేశాలవైపు దృష్టిసారించాయి. ఫలితంగా దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలకు అవకాశాలు పెరిగినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం కారణంగా విక్రయానికి వచ్చిన అక్కడి కంపెనీలను సైతం కొనుగోలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. గత కొద్ది నెలలుగా చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో పలు చిన్న కంపెనీలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవలలు అందించేందుకు భారీ డిల్స్‌ను సైతం కుదుర్చుకున్నాయి. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లోనూ ఇతర కంపెనీల కొనుగోళ్లు, లేదా కాంట్రాక్టులను పొందేందుకు ప్రయత్నించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. (డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే) జర్మన్ జోష్ యూరోప్‌లో ఇటీవల జర్మనీ నుంచి దేశీ కంపెనీలు మెగా డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. గతంలో ఎప్పుడూ ఔట్‌సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వని జర్మన్ కంపెనీలు కరోనా కల్లోలంతో వ్యూహాలు మార్చుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితరాలకు అవకాశాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది నెలలుగా యూరోపియన్ ప్రాంత ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం తెలియజేశారు. ఇది కొనసాగే వీలున్న్లట్లు అంచనా వేశారు. గతేడాది నవంబర్‌లో డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్స్‌ను టీసీఎస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 1,500 మంది జర్మన్ ఉద్యోగులకు శిక్షణ, తదితర సేవలను అందిస్తోంది. ఇదే నెలలో బీమా దిగ్గజం ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రామెరికా సిస్టమ్స్ ఐర్లాండ్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వల్ల వీసాల సమస్యలున్న ప్రాంతాలలో 2,500 మంది ఉద్యోగులను వెనువెంటనే వినియోగించుకునేందుకు వీలు చిక్కినట్లు సుబ్రమణ్యం చెప్పారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాలలో భారీగా వృద్ధిని ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
కెవ్వు క్రాష్!
యూరప్‌లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్లు విధిస్తారనే భయాలు చెలరేగాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా భారీగానే నష్టపోయింది. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల ఎగువన నిలదొక్కుకోగలిగినా, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 11,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. 1,052 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ బలహీనంగానే మొదలైంది. మధ్య మధ్యలో లాభాల్లోకి వచ్చినా, ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైంది. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభం కావడంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల జోరు పెరిగింది. చివరి గంటలో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరోదశలో 907 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 1,052 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు– కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 9 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ భారీగా నష్టపోయినా దాదాపు 140 షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, వీఎస్టీ టిల్లర్స్, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎందుకీ పతనం.. బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు...! ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్‌లు 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్ కన్సార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్(ఐసీఐజే) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టాయి. ఇక భారత్ విషయానికొస్తే, 2010–17 మధ్య ఇలాంటి అక్రమ లావాదేవీలు 400కు పైగా జరిగాయని వీటి విలువ వంద కోట్ల డాలర్ల మేర ఉంటుందని అమెరికాకు చెందిన ఫిన్సెన్(ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్) పేర్కొంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక అవకతవకలు తదితర అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ఈ లావాదేవీల కారణంగా దేశంలోకి 48 కోట్ల డాలర్లు అక్రమంగా వచ్చాయని, 40 కోట్ల డాలర్లు వెళ్లాయని ఫిన్సెన్ పేర్కొంది. దాదాపు భారత్‌లోని అన్ని బ్యాంకులకు ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. యూరప్‌లో మళ్లీ లాక్డౌన్! రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో తాజాగా ఆంక్షలు విధించారు. మరోవైపు రోజుకు 6,000 మేర కరోనా కేసులు నమోదవుతుండటంతో (మన దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయి) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన యూరప్ ఇన్వెస్టర్లు బ్యాంక్, టూరిజమ్, వినియోగ రంగ షేర్లను తెగనమ్మారు. ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఆరంభంలోనే 3 శాతం మేర క్షీణించిన యూరప్ మార్కెట్లు చివరకు 4 శాతం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఆవిరి కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా తదుపరి సుప్రీంకోర్ట్ జడ్జి ఎవరనే విషయంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య పోరు తప్పదనే భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నివురుగప్పిన నిప్పులా సరిహద్దు ఉద్రిక్తతలు... సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా భారత్–చైనాల మధ్య చర్చలు ప్రారంభమైనా, సరిహద్దుల్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, ఈ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఈ గురువారమే ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటం, నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల రేంజ్లో ఉండటంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రూ. 4.23 లక్షల కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.4.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,23,140 కోట్లు దిగజారి రూ.154.76 లక్షల కోట్లకు పడిపోయింది. విలువలు అధికంగా ఉన్నాయ్.. షేర్ల విలువలు అసమంజసమైన స్థాయిల్లో ఉన్నాయని, ఈ విలువలను షేర్లు నిలుపుకోలేవన్న ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కొంత కాలం పాటు మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఒడిదుడుకులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ప్రపంచ మార్కెట్లకు కోవిడ్ కాటు
ఈ ఏడాది(2020)లో ప్రపంచ ఆర్థిక వృద్ధి దాదాపు 5 శాతం క్షీణించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) తాజాగా అంచనా వేసింది. తొలుత అంతర్జాతీయ జీడీపీ 3 శాతం క్షీణతను మాత్రమే చవిచూడనున్నట్లు అభిప్రాయపడింది. అమెరికా, చైనా తదితర దేశాలలో రెండో దశ కోవిడ్-19 కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ తాజాగా అంచనాలు సవరించింది. ఇప్పటికే బీజింగ్‌లో కరోనా కేసులు పెరుగుతుండగా.. న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాలు సైతం మళ్లీ కోవిడ్-19 బారిన పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల ఆవశ్యకత ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు ఇకపై 14 రోజులపాటు సొంత క్వారంటైన్ పాటించవలసి ఉంటుందని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్ర గవర్నర్లు ప్రకటించారు. ఫ్లోరిడా, ఒక్లహామా, దక్షిణ కరోలినాలలో ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు బుధవారం అమెరికా, యూరోపియన్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఆసియా సైతం బుధవారం డోజోన్స్ 710 పాయింట్లు(2.75 శాతం) పతనమై 25,446 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 81 పాయింట్లు(2.6 శాతం) పడిపోయి 3,050 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ 222 పాయింట్లు(2.2 శాతం) కోల్పోయి 9,909 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 10,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్, యూకే 3 శాతం, జర్మనీ 3.5 శాతం చొప్పున పతనమయ్యాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో కొరియా, థాయ్‌లాండ్, జపాన్, సింగపూర్, ఇండొనేసియా 2-1 శాతం మధ్య క్షీణించాయి. చైనా, తైవాన్, హాంకాంగ్ మార్కెట్లకు సెలవు. కాగా.. ముడిచమురు ధరలు సైతం బుధవారం 5 శాతం(2 డాలర్లు) చొప్పున పతనమయ్యాయి. క్రూయిజర్ వీక్ యూఎస్ ఎయిర్‌లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు అమ్మకాల షాక్ తగిలింది. క్రూయిజ్ కంపెనీ కార్నివాల్ కార్ప్‌నకు రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ ‘జంక్’ హోదాను ప్రకటించడంతో ఈ షేరు 11 శాతం కుప్పకూలింది. ఈ బాటలో రాయల్ కరిబియన్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, విన్ రిసార్ట్స్ తదితరాలు సైతం 11 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ 4 శాతం క్షీణించింది. కాగా.. క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ సంస్థ వీఎంవేర్ ఇంక్‌ను విడదీసి విక్రయించనున్నట్లు ప్రకటించడంతో కంప్యూటర్ల దిగ్గజం డెల్ 8 శాతం జంప్‌చేసింది. వీఎంవేర్ 2.5 శాతం బలపడింది. వీఎంవేర్ ఇంక్‌లో డెల్ వాటా విలువ 50 బిలియన్ డాలర్లుగా అంచనా. -
భారీ లాభాల్లో ప్రపంచ మార్కెట్లు
హాంకాంగ్/న్యూయార్క్: కొన్ని దేశాల్లో ‘కరోనా’ మరణాలు తగ్గడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. కరోనా హాట్‌స్పాట్ దేశాలైన ఇటలీ, స్పెయిన్‌ల్లో కొత్త కేసులు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు 2–4 శాతం, యూరప్ మార్కెట్లు 3–6 శాతం లాభపడగా, రాత్రి గం. 11.30 ని.లకు అమెరికా స్టాక్ సూచీలు 5–6 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా సోమవారం మన మార్కెట్ పనిచేయలేదు. ఒకవేళ మన స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడింగ్ జరిగి ఉంటే, సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం లాభపడి ఉండేవని నిపుణులంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా కేసులు 12 లక్షలకు, మరణాలు 70,000కు పెరిగాయి. అయితే కొన్ని యూరప్ దేశాల్లో మరణాలు అంతకు ముందటి రోజుల కంటే తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఇటలీలో రెండు వారాల్లో కనిష్ట మరణాలు ఆదివారమే నమోదయ్యాయి. మరోవైపు స్పెయిన్‌లో మరణాల సంఖ్య వరుసగా మూడో రోజూ తగ్గింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. ఇక అమెరికాలో కేసుల సంఖ్య నిలకడ స్థాయికి చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించడం కలసి వచ్చింది. ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సోమవారం మొదటి సెషన్లో 4 శాతం లాభపడగా, రెండో సెషన్లో 1 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు (మంగళవారం) సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్ అప్‌తో మొదలవుతాయని అంచనా. -
3 వేల ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ కూడా ఉద్యోగాలను తీసివేసే పనిలో పడింది. సంస్థ పునర్నిర్మాణంతోపాటు, ఖర్చులను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూరోపియన్ యూనిట్లలో భారీగా ఉద్యోగులను తొలగించనుంది. బలహీన డిమాండ్, అధిక వ్యయాలతో కుస్తీలు పడుతున్న సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ ఆడమ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీన్ని ధృవీకరించిన టాటా స్టీల్ తీవ్రమైన మార్కెట్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని, కార్బన్-న్యూట్రల్ స్టీల్ మేకింగ్ వైపు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ మార్పులు అవసరమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 3 వేలమందికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ఐరోపాలో ఉక్కు తయారీ అంతర్జాతీయ పోటీ, అధిక ఇంధన వ్యయాల ఒత్తిడి నేపథ్యంలో భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. మొత్తం తాజా కోతలో మూడింట రెండు వంతుల మంది వైట్ కాలర్ ఉద్యోగాలంటాయని అంచనా. యూరోపియన్ వ్యాపారంలో మొత్తం 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
సెన్సెక్స్ ప్లస్.. నిఫ్టీ మైనస్
♦ రికార్డుస్థాయి సమీపం నుంచి వెనుతిరిగిన సూచీలు ♦ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం ముంబై: ఆగస్టు తొలివారంలో సృష్టించిన రికార్డు గరిష్టస్థాయికి బుధవారం చేరువగా వెళ్లిన సూచీలు..అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి వెనక్కు తగ్గాయి. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్లు, జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి 1.2 శాతం పెరిగినట్లు క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చిన నిరుత్సాహకర డేటాను లెక్కచేయకుండా...ట్రేడింగ్ తొలిదశలో ర్యాలీ జరిగింది. అయితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో ట్రేడింగ్ ముగింపులో మార్కెట్ చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పలాభంతోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పనష్టంతోనూ ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.131 పాయింట్ల గరిష్టస్థాయికి వరకూ పెరిగిన తర్వాత..10,100 పాయింట్లస్థాయిని కోల్పోయి 10,063 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల నష్టంతో 10,079 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ ఆగస్టు 2న 10,138 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 32,348 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 32,127 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 28 పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద ముగిసింది. గత నెలలో సెన్సెక్స్ సృష్టించిన కొత్త రికార్డుస్థాయి 32,686 పాయింట్లు. కొత్త రికార్డుస్థాయి సమీపానికి చేరగానే మార్కెట్ ఒడుదుడుకులకు లోనయ్యిందని, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. పెట్రో కంపెనీలు డౌన్...:ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల భారాన్ని ఇకనుంచి వినియోగదారులకు మళ్లించకుండా, కంపెనీలే భరించాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు కొన్ని ఫైనాన్షియల్ చానళ్లలో వార్తలు వెలువడటంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. షేర్లు 4–6 శాతం మధ్య పతనమయ్యాయి. మాట్రిమోనీ ఐపీఓకు 4.4 రెట్లు సబ్స్క్రిప్షన్ ఆన్లైన్ వివాహవేదికను నిర్వహిస్తున్న మాట్రిమోనీ డాట్ కామ్ జారీచేసిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 4.41 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ముగింపురోజైన బుధవారం రాత్రి 7.15 సమయానికి ఎన్ఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం 1.24 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ. 983–985 ప్రైస్‌బ్యాండ్‌తో 28 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 17.99 రెట్లు బిడ్స్ వచ్చాయి. -
సెన్సెక్స్ 247 పాయింట్లు డౌన్
- 25,617 పాయింట్ల వద్ద ముగింపు - 73 పాయింట్ల నష్టంతో 7,796కు నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రభావం చూపాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు పోటెత్తాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అక్టోబర్ సిరీస్ తొలిరోజున బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 25,617 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక దశలో 25,937 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 247 పాయింట్ల నష్టపోయింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 49 శాతానికి తగ్గనుందన్న వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 30 శాతం వరకూ పెరిగింది. 7శాతం లాభంతో రూ.79 వద్ద ముగిసింది. ఆసిడిటీ చికిత్సలో ఉపయోగపడే ఆస్ట్రాజెనెకా నెక్సియమ్‌కు జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ బీఎస్ఈలో 5.3 శాతం పెరిగి రూ.4,185 వద్ద ముగిసింది. -
నిలబెట్టిన యూరప్
- 171 పాయింట్ల లాభంతో 25,823కు సెన్సెక్స్ - 34 పాయింట్ల లాభపడి 7,883కు నిఫ్టీ యూరప్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మన స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల బాగా తగ్గిన రియల్టీ, బ్యాంక్ షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, సెప్టెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్న నేపథ్యంలో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 25,823 పాయింట్లకు, నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 7,883 పాయింట్ల వద్ద ముగిశాయి. వచ్చే వారం జరగనున్న పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు 1 శాతం నష్టం నుంచి కోలుకున్నాయి. విద్యుత్ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. నష్టాలతో మొదలై.. లాభాల్లో ముగింపు చైనా పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు బలహీనంగా ఉండటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ కూడా నష్టాల్లోనే ఆరంభమైంది. కమోడిటీ ధరలు పెరిగిన కారణంగా యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో మన మార్కెట్ కూడా లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 25,527 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమైంది. 548 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాభాల్లో 19 సెన్సెక్స్ షేర్లు.. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,473 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.15,718 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,83,513 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,330 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.891 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. పీఎంఐ వరుసగా ఏడో నెలలో కూడా క్షీణించడంతో ఆసియా మార్కెట్లు 2.35 శాతం వరకూ పడిపోయాయి. ఆసియా మార్కెట్లు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం నెల రోజుల కాలంలో ఇదే మొదటిసారి. -
టప..టపా..!
- యూరప్ మార్కెట్ల ప్రభావం - చివరి రెండు గంటల్లో అమ్మకాల వెల్లువ - సెన్సెక్స్ 541 పాయింట్లు డౌన్; 26 వేల దిగువకు - 165 పాయింట్ల నష్టంతో 7,812కు నిఫ్టీ యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలవడంతో మంగళవారం మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. అప్పటివరకూ స్వల్పలాభాలతో ట్రేడైన స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో భారీగా నష్టపోయింది. యూరోప్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడం, అమెరికా డోజోన్స్ ప్యూచర్స్ భారీ నష్టాలతో ట్రేడవడం, మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడంతో మన మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 66 స్థాయికి పడిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, లాభాల స్వీకరణ, ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితి కూడా ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 26 వేలు, నిఫ్టీ 7,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 541 పాయింట్లు క్షీణించి 25,652 పాయింట్ల వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు క్షీణించి 7,812 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలూ 2.07 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. చివరి రెండు గంటల్లో అమ్మకాలు పోటెత్తాయి. బ్యాంక్, ఇన్ఫ్రా, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. - ఇంట్రాడేలో సెన్సెక్స్ 607 పాయింట్లు. నిఫ్టీ 189 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇంట్రా డే గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకూ పడిపోయింది. - 30 షేర్ల సెన్సెక్స్‌లోనూ, 50 షేర్ల నిఫ్టీలోనూ నాలుగు షేర్లు(విప్రో, ఇన్ఫీ, మహీంద్రా, సన్‌ఫార్మా)లు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో 26 షేర్లు, నిఫ్టీలో 46 షేర్లు నష్టపోయాయి. - వచ్చే వారం ఆర్బీఐ పాలసీ ఉన్న నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు-బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు నష్టపోయాయి. - లోహాలను అధికంగా వినియోగించే చైనాలో ఆర్థిక మందగమనం చోటుచేసుకుంటుందన్న తాజా ఆందోళనలతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్(ఎల్ఎంఈ)లో ప్రధాన లోహ ధరలు పతనమయ్యాయి. దీంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తి లోహ షేర్లు విలవిలలాడాయి. వేదాంత 6.2%, హిందాల్కో 6.2%, కోల్ ఇండియా 5.4%, జిందాల్ స్టీల్ 5%, టాటా స్టీల్ 3%, ఎన్ఎండీసీ 2%, సెయిల్ 2% చొప్పున పతనమయ్యాయి. - ఎన్టీపీసీ 4.5%, లార్సెన్ అండ్ టుబ్రో 4.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.5%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.4 శాతం, హెచ్డీఎఫ్సీ 3.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.1 శాతం, టాటా స్టీల్ 3 శాతం చొప్పున తగ్గాయి. - ఫోక్స్‌వ్యాగన్ వివాదం నేపథ్యంలో టాటా మోటార్స్ 4.79 శాతం క్షీణించింది. ఫోక్స్‌వ్యాగన్‌కు విడిభాగాలు సరఫరా చేసే మదర్సన్ సుమి షేర్ దాదాపు 8 శాతం పడిపోయింది. - రూ.1,400 కోట్ట జీఎస్టీ కాంట్రాక్టును దక్కించుకోవడం, అమెరికాకు చెందిన టీఓఎంఎస్ షూస్ కంపెనీతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇన్ఫోసిస్ పెరిగింది. - టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,729 కోట్లుగా, ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.17,421 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,72,191 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,052 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.378 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. - ఆసియా మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. లక్ష కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఇన్వెస్టర్ల సంపద) రూ. 1.36 లక్షల కోట్లు తగ్గి రూ.93.33 లక్షల కోట్లకు పడిపోయింది. పతనం..ప్రధాన కారణాలు యూరో మార్కెట్ల దెబ్బ: ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు దాదాపు 3 శాతం వరకూ పతనమయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో దక్షిణ కొరియా దర్యాప్తుకు ఆదేశించడం, యూరప్ వ్యాప్తంగా వాహన కంపెనీలపై దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి పిలుపునివ్వడం. డోజోన్స్ ఫ్యూచర్స్ 225 పాయింట్ల వరకూ పతనమవడం, చైనా నుంచి డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనలతో రాగి ధరలు పడిపోవడం, వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్ నిర్ణయం తర్వాత డాలర్ పుంజుకొని రెండు వారాల గరిష్ట స్థాయికి చేరడం తదితర అంశాలు ప్రభావం చూపాయి. చైనా చింత: చైనాలో బలహీనంగా ఉన్న వృద్ధి కారణంగా మిగిలిన ఆసియా దేశాల్లో కూడా మందగమనం చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆందోళననలు అంతర్జాతీయంగా సెంటిమెంట్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఏడీబీ ఎఫెక్ట్: భారత వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) 7.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. వర్షాలు తగినంతగా లేకపోవడం, ఎగమతులకు డిమాండ్ లేకపోవడం, ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆశక్తత వంటి కారణాల వల్ల వృద్ధి అంచనాలను తగ్గించామని ఏడీబీ పేర్కొంది. ఫెడ్ అనిశ్చితి: రేట్ల పెంపు విషయమై ఫెడరల్ రిజర్వ్ అనిశ్చితి మార్కెట్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. రేట్ల పెంపు ఈ ఏడాదే ఉంటుందని ఫెడ్ ఉన్నతాధికారి ఒకరు, వచ్చే నెలలో ఉండొచ్చని మరొక ఫెడ్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంతో గందరగోళం, అయోమయం పెరిగిపోతున్నాయని క్రెడిట్ సూసీ అసెట్ మేనేజ్మెంట్కు చెందిన రాబర్ట్ పార్కర్ వ్యాఖ్యానించారు. -
ఆర్థిక సంవత్సరానికి లాభాల స్వాగతం
♦ బ్యాంక్ షేర్ల ర్యాలీ ♦ యూరో మార్కెట్ల ప్రభావం ♦ 303 పాయింట్ల లాభంతో 28,260కు సెన్సెక్స్ ♦ 95 పాయింట్ల లాభంతో 8,586కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి శుభారంభం పలికింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం, యూరోప్ మార్కెట్లు పెరగడం స్టాక్ మార్కెట్ జోరును పెంచింది. తక్కువ ధరల్లో లభ్యమవుతున్న షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫార్మా షేర్ల జోరుతో కొత్త సంవత్సరం తొలి రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 28,260 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి(1.12 శాతం) 8,586 వద్ద ముగిశాయి.గత మూడు సార్లూ వారాంత నష్టాల్లో ముగుస్తూ వచ్చిన స్టాక్ మార్కెట్ తొలిసారిగా ఈ వారం లాభాల్లో ముగిసింది. స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి పెరిగాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.3 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం చొప్పున పెరిగాయి. ఈ వారంలో సెన్సెక్స్ లాభం 3 శాతం మంగళవారంతో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లోనే ప్రారంభమైంది. ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మరింత నష్టాలకు గురైంది. ఒక దశలో 27,889 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల జోరు కారణంగా 28,298 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 303 పాయింట్ల లాభం(1 శాతం)తో 28,260 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఒక దశలో 8,603 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మంగళవారం వెలువడిన కీలక రంగాల గణాంకాలు బలహీనంగా ఉండడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెంటిమెంట్ బలహీనంగా ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకునే అవకాశాలున్నాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టిందని వివరించారు. బ్యాంకింగ్ షేర్ల కారణంగా ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 3 శాతం లాభంతో ముగిసిందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు. సన్ ఫార్మా జోరు ర్యాన్‌బాక్సీ విలీనం, రూ.1,241 ధరకు చేరుతుందన్న మోర్గాన్ స్టాన్లీ అంచనాలతో సన్ ఫార్మా షేరు 5.5 శాతం పెరిగి రూ.1,081 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(1,094)కు చేరింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఏప్రిల్ 7 ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో బ్యాంక్ షేర్లు, ఆర్థిక సంస్థల షేర్లు పెరిగాయి. ఎరువుల రంగానికి గ్యాస్ పూలింగ్ విధానాన్ని కేంద్రం ఖరారు చేయడంలో ఈ రంగం షేర్లు 3-12 శాతం రేంజ్లో పెరగ్గా, గెయిల్ ఇండియా, ఓఎన్జీసీలు నష్టపోయాయి. తమ ఐటీ ఆదాయం బలహీనంగా వుండవచ్చని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హెచ్చరించడంతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఐపీవోలకు మరో ఐదు కంపెనీల దరఖాస్తు క్యాధలిక్ సిరియన్ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి సంబంధించిన పత్రాలను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించింది. ఈ బ్యాంక్‌తో పాటు మరో నాలుగు సంస్థలు- దిలిప్ బిల్ట్‌కాన్, నవ్కార్ కార్పొరేషన్, ప్రభాత్ డైరీ, ఎంఎం ఆటో ఇండస్ట్రీస్‌లు ఐపీఓ ప్రతిపాదనలతో సెబీ ముందుకు వచ్చాయి. ఈ ఐదు సంస్థలు కలిసి కనీసం రూ.2,000 కోట్లు ఐపీఓల ద్వారా సమీకరిస్తాయని అంచనా. ఐపీఓల ద్వారా క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ రూ.400 కోట్లు, నవ్కార్ కార్పొరేషన్ రూ.600 కోట్లు, దిలిప్ బిల్డ్‌కాన్ రూ.650 కోట్లు, ప్రభాత్ డైరీ రూ.300 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. ఈ ఏడాది ఐపీఓల వెల్లువ తప్పదని నిపుణులంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 12 కంపెనీలు ఐపీఓ అనుమతుల కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. రెండు రోజులు సెలవు గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ 2 రోజులు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్క, మనీ, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు పనిచేయవు. స్టాక్ ఎక్స్ఛేంజ్లు మళ్లీ వచ్చే సోమవారం ప్రారంభమవుతాయి. గురువారం బులియన్ మార్కెట్ పనిచేస్తుంది. ఇక శుక్రవారం రోజు మెటల్, షుగర్, పెప్పర్ మార్కెట్లు పనిచేస్తాయి. -
పడగొట్టిన విదేశీ అంశాలు
►సెన్సెక్స్ 192 పాయింట్లు డౌన్ ►25,895 వద్ద ముగింపు ►70 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ►మూడు వారాల్లో అత్యధిక నష్టం యూరోజోన్ ద్రవ్యోల్బణం జూలై నెలకు అనూహ్యంగా 0.4%కు పడిపోవడం, పోర్చుగల్(లిస్బన్) స్టాక్ ఎక్స్ఛేంజీలో బ్యాంకింగ్ సంస్థ ఎస్పిరిటో శాంటో షేర్లు 50% పతనంకావడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. యూరో ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టానికి చేరగా, ఎస్పిరిటో బ్యాంక్ రెండో క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రికార్డుస్థాయి న ష్టాలను ప్రకటించడం ఇందుకు కారణమయ్యాయి. దీంతో దేశీయంగానూ స్టాక్ మార్కెట్లు బలహీనంగా మొదలయ్యాయి. ఆపై స్వల్ప ఒడిదుడుకుల మధ్య కదులుతూ వచ్చాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతుండటంతో ఉన్నట్టుండి మిడ్ సెషన్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ కనిష్టంగా 25,853 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 192 పాయింట్ల నష్టంతో 25,895 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా గత మూడు వారాల్లోలేని విధంగా 70 పాయింట్లు క్షీణించి 7,721 వద్ద నిలిచింది. ఉక్రెయిన్ ఆందోళనలు, జూలై ఎఫ్‌అండ్‌వో ముగింపు వంటి అంశాలు కూడా మార్కెట్ల హెచ్చుతగ్గులకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 11న 348 పాయింట్లు పతనమైంది.