లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Published Thu, Jun 8 2017 9:39 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 31.25 పాయింట్ల లాభంలో 31,302 వద్ద, నిఫ్టీ 7.95 పాయింట్ల లాభంలో 9,671 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ స్టాక్స్ అన్నింటిల్లో టాటా స్టీల్ లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్ 4 శాతం మైన పైకి ఎగిసింది. టాటా స్టీల్ తో పాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, లుపిన్, అరబిందో ఫార్మా, హిందాల్కో లు లాభాలను పండిస్తున్నాయి. టీసీఎస్, గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా పవర్, భారతీ ఇన్ ఫ్రాటెల్ ఒత్తిడితో కొనసాగుతున్నాయి.
రిజర్వు బ్యాంకు బుధవారం ప్రకటించిన పాలసీలో బ్యాంకులకు సానుకూలంగా ఎస్ఎల్ఆర్ రేటును తగ్గించడంతో నేటి ట్రేడింగ్ లో బ్యాంకు నిఫ్టీ సరికొత్త స్థాయిలను తాకుతోంది. బ్యాంకింగ్ తో పాటు, మెటల్ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి, 64.40 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 151 రూపాయల నష్టంతో 29,416 వద్ద ట్రేడవుతోంది.
Advertisement