100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్
Published Mon, May 15 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు సోమవారం మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 136.91 పాయింట్ల లాభంలో 30,325 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 9400 మార్కుకు పైన, 31.60 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలార్జించగా.. సిప్లా, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, బీపీసీఎల్, భారతీ ఇన్ ఫ్రాటెల్ నష్టాలు గడించాయి.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలపడి 64.12 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 32 పైసలు బలపడి, 64.06గా ఉంది. అంచనాలను తాకలేక అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా నమోదుకావడం, నార్త్ కొరియా మరో క్షిపణి పరీక్ష డాలర్ ఇండెక్స్ ను పడగొడుతున్నాయి. మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ విలువ పడిపోతుంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 4 రూపాయల లాభంతో 28,008గా ట్రేడవుతున్నాయి.
Advertisement