ఉత్సాహంగా ఎంట్రీ.. చివరికి ఫ్లాట్
Published Tue, May 2 2017 4:13 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
ముంబై: రియాల్టీ, బ్యాంకింగ్ జోరుతో ఉత్సాహంగా ప్రారంభమైన మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా 2.78 పాయింట్ల లాభంలో 29,921.18 వద్ద, నిఫ్టీ 9.75 పాయింట్ల లాభంలో 9313.80 వద్ద క్లోజ్ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలు పండించగా.. లుపిన్, భారతీ ఎయిర్ టెల్, టాటామోటార్స్, డీవీఆర్ లు ఎక్కువగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 150 పాయింట్ల మేర, నిఫ్టీ 9352.55 స్థాయిలను తాకింది. కానీ ఇంట్రాడేలో గరిష్టస్థాయిలను తాకిన సూచీలు ప్రాపిట్ బుకింగ్ తో సెషనంతా ఫ్లాట్ గా ట్రేడయ్యాయి. చివరికి సెన్సెక్స్ 3 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల లాభంలో సెటిల్ అయ్యాయి.
జనవరి-మార్చి క్వార్టర్ లో ట్రాక్టర్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదుచేసినట్టు ఎస్కార్ట్స్ ప్రకటించగానే, కంపెనీ షేర్లు నేటి ఇంట్రాడేలో 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. 4 శాతం పెరిగిన ఈ కంపెనీ షేర్లు చివరికి 3.23 శాతం లాభంలో 565.20గా ముగిశాయి.. టాటా మోటార్స్ కంపెనీ అమ్మకాల ప్రదర్శన గతేడాది కంటే ఈ ఏడాది సరిగ్గా లేకపోవడంతో ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 2 శాతం మేర కుదేలయ్యాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 64.19గా ఉంది. బంగారం ధరలు సైతం ఎంసీఎక్స్ మార్కెట్లో స్వల్పంగా 47 రూపాయల పడిపోయి 28,606గా ఉన్నాయి.
Advertisement
Advertisement