లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Published Mon, Aug 7 2017 9:37 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తుండటంతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 10,100 మార్కును చేధించడానికి చూస్తోంది. ప్రస్తుతం 20.60 పాయింట్ల లాభంతో 10,087 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 53.66 పాయింట్ల లాభంలో 32,379 వద్ద కొనసాగుతోంది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ 2 శాతం మేర లాభాలు గడిస్తోంది. యూకేలో జేఎల్‌ఆర్ అమ్మకాలు బలహీనంగా ఉన్నప్పటికీ టాటా మోటార్స్ 1 శాతం మేర జంప్ చేసింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.5 శాతం పైకి ఎగిసింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనా వేసిన దానికంటే మెరుగ్గా రావడంతో ఆసియా మార్కెట్లు మంచిగా ట్రేడవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 63.68 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 176 రూపాయల నష్టంలో 28,400 రూపాయలుగా కొనసాగుతున్నాయి.
Advertisement