
పెల్లెట్ కంపెనీ బీఆర్‌పీఎల్ టాటాస్టీల్ చేతికి...
ఒడిశా కేంద్రంగా పనిచేసే ఐరన్‌ఓర్ పెల్లెట్ తయారీ కంపెనీ బీఆర్‌పీఎల్‌ను రూ.900 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది.
రూ.900 కోట్లకు ఒప్పందం
న్యూఢిల్లీ: ఒడిశా కేంద్రంగా పనిచేసే ఐరన్‌ఓర్ పెల్లెట్ తయారీ కంపెనీ బీఆర్‌పీఎల్‌ను రూ.900 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. మెటాలిక్ అవసరాలు తీర్చుకునేందుకు, కళింగ్‌నగర్ స్టీల్ ప్లాంట్, జంషెడ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లకు ముడి పదార్థాల అవసరాలను తీర్చేందుకు ఈ కొనుగోలు వీలు కల్పిస్తుందని టాటా స్టీల్ తెలిపింది. నాలుగు నెలల్లో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
బీఆర్‌పీఎల్‌లో 100 శాతం ఈక్విటీ కొనుగోలును ఆర్యా మైనింగ్ అండ్ ట్రేడింగ్ కార్ప్ (ఏఎంటీసీ), ఇతర కంపెనీల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేసే ఒప్పందాలను కదుర్చుకున్నట్టు తెలిపింది. బ్రాహ్మణి రివర్ పెల్లెట్స్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్)కు ఒడిశాలోని బార్డిల్‌లో 4.7 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్ బెనిఫికేషన్ ప్లాంట్‌తోపాటు జైపూర్‌లో వార్షికంగా 4 మిలియన్ టన్నుల పెల్లెట్ తయారీ సామర్థ్యంగల ప్లాంట్ ఉంది. ఐరన్, స్టీల్ పరిశ్రమలకు అవసరమైన పెల్లెట్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది.