ఈజీఎంను ఏర్పాటు చేయండి...
టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్‌కి టాటా సన్స్ ఆదేశం
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీల బోర్డుల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడానికి టాటా సన్‌స సిద్ధమౌతోంది. ఆయా కంపెనీల బోర్డుల నుంచి మిస్త్రీ, నుస్లి వాడియాలను తొలగించడానికి ఎక్స్‌ట్రా-ఆర్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) ఏర్పాటు చేయాలని ఆయా కంపెనీలకు టాటా సన్‌స తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆయా కంపెనీలు వేర్వేరుగా శుక్రవారం బీఎస్‌ఈకి నివేదించారుు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీలకు టాటా సన్‌స హోల్డింగ్ కంపెనీ. టాటా సన్‌సకి టాటా మోటార్స్‌లో 26.51 శాతం, టాటా కెమికల్స్‌లో 19.35 శాతం, టాటా స్టీల్‌లో 29.75 శాతం వాటాలు ఉన్నారుు. ఇండియన్ హోటల్స్ తర్వాత టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీకి బాసగటా నిలుస్తున్నారు. వాడియా కూడా ఇందులో ఉన్నారు.