నస్లీ వాడియాతో టాటాలు బ్రేక్ అప్
Published Sat, Nov 12 2016 9:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
ముంబై : దశాబ్దాల తరబడి కొనసాగుతున్న టాటా, వాడియాల స్నేహం ఇక బీటలు వారబోతోంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించిన వివాదం నన్లీ వాడియా, రతన్ టాటాల స్నేహం తెగదెంపుల స్థాయికి వెళ్లింది. నెస్లీ వాడియా, మిస్త్రీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడనే నెపంతో మూడు గ్రూప్ కంపెనీలకు బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న వాడియాను తొలగించాలని టాటాలు పావులు కదుపుతున్నారు. చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ వార్గా పేరుగాంచిన టాటా గ్రూప్ వివాదంపై వాడియా కుటుంబసభ్యులు, టాటాలకు వ్యతిరేకమై, సైరస్ మిస్త్రీకి అనుకూలంగా నిలిచారు. కంపెనీ చైర్మన్గా మిస్త్రీనే ఉంచాలని మద్దతుపలుకుతూ టాటా కెమెకిల్స్ సీనియర్ స్వతంత్ర డైరెక్టర్ వాడియా తన నిర్ణయం తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన టాటా సన్స్, టాటా కెమికల్స్కు, టాటా స్టీల్కు, టాటా మోటార్స్కు శుక్రవారం నోటీసులు జారీచేసింది. వాడియాను బోర్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది. టాటా గ్రూప్ ఆదేశాలతో టాటా స్టీల్ శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ వాడియా మళ్లీ మిస్త్రీకే అనుకూలంగా నిలిచారు. కాగ, టాటా మోటార్స్ బోర్డు మీటింగ్ నేడు జరుగనుంది.
1981 నుంచి వాడియా, టాటా కెమికల్స్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. 1979 ఆగస్టు నుంచి టాటా స్టీల్ బోర్డులో, 1998 డిసెంబర్ నుంచి టాటా మోటార్స్ బోర్డులో కొనసాగున్నారు. శుక్రవారం జారీచేసిన ఆదేశాలతో, ఈ మూడు కంపెనీలు వాడియాను డైరెక్టర్షిప్ నుంచి తొలగించడానికి అసాధారణ బోర్డు సమావేశాలకు పిలుపునిచ్చాయి. కాగ, వాడియాను డైర్టకర్షిప్ నుంచి తొలగించాలంటే, ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ నుంచి టాటా సన్స్ మెజార్జీ సపోర్టును పొందాల్సి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తన తొలగింపుపై టాటా సన్స్ కదుపుతున్న పావులపై వాడియా మండిపడ్డారు. బోర్డుల నుంచి తనను తొలగించడం అసమంజసమని, దశాబ్దాలుగా బోర్డులో సభ్యుడిగా నిర్వహిస్తున్న తనను తొలగించాలంటే, కచ్చితమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వాడియా పేర్కొన్నారు. ఈ వార్లో మిస్త్రీ, వాడియాలు ఓ వైపు ఉండగా.. రతన్ టాటా మరోవైపు ఉన్నారని, ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుందని టాటా గ్రూప్లో ఓ ప్రముఖ సభ్యుడు వ్యాఖ్యానించారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement