భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఈ రోజు ప్రపంచం గర్వించే స్థాయిలో ఉంది. అయితే ఈ స్థాయికి రావడానికి కంపెనీ ఎన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. టాటా ఇండికాతో మొదలైన కంపెనీ ప్రయాణం ఎలా సాగింది? ఇందులో రతన్ టాటా పాత్ర ఏవిధంగా ఉందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
1998 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాటా ఇండికా అప్పట్లోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకుంది. ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్‌గా అమ్ముడైన ఈ కారు కోసం కంపెనీ ''ఇంకెప్పుడూ చిన్న కారుతో బాధపడాల్సిన అవసరం లేదు'' అనే చిన్న యాడ్‌తో ఎంతో మంది ప్రజలను ఆకర్శించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో రతన్ టాటా 'టాటా ఇండికా'ను డ్రైవ్ చేయడం చూడవచ్చు.
WildFilmsIndia అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో ఇండికా తయారు చేసే విధానం కూడా చూడవచ్చు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం కోసం 'టాటా ఇండికా'ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ప్రజల అవసరాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఉత్పత్తి నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తెలిసింది. నిజానికి టాటా కంపెనీ ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడం అదే మొదటిసారి. అంతకు ముందు కంపెనీ ట్రక్కులు, బస్సులు మాత్రమే తయారు చేసేది.
(ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..)
టాటా ఇండియాలో ఏర్పడిన నాణ్యత లోపాలను కంపెనీ పరిష్కరించగలిగింది. ఆ తరువాత ఇండికా వి2 పేరుతో రీబ్యాడ్జ్ వెర్షన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది కేవలం దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా ప్రవేశించిన మొదటి వాహనం కూడా ఇదే.
అనేక సంవత్సరాలుగా డీజిల్ ఇంజన్‌తో నడిచే ఏకైక వాహనం ఇండికా కావడం విశేషం. ఇందులోని 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 60 bhp పవర్ 104 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1998 డిసెంబర్ 30 న ప్రారంభమైన టాటా ఇండికా కేవలం 1,15,000 బుకింగ్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 2.59 లక్షలు, టాప్ ఎండ్ డిఎల్ఎక్స్ ధర రూ. 3.9 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment