Tata Chemicals
-
సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభం
ముంబై: టాటా కెమికల్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం మేర తగ్గి రూ.267 కోట్లకు పరిమితమైంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ.190 కోట్లతో పోల్చితే పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.495 కోట్లుగా ఉండడం గమనార్హం.ఆదాయంలో పెద్దగా మార్పు లేకుండా రూ.3,999 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,998 కోట్లుగా ఉంది. ‘‘భారత్‌లో సోడాయాష్‌కు డిమాండ్ స్థిరంగా ఉంది. అమెరికా, యూరప్‌లో కంటెయినర్ గ్లాస్ తదితర విభాగాల్లో డిమాండ్ స్తబ్దుగా ఉంది. జూలై, ఆగస్ట్‌లో అసాధారణ వర్షాలతో మిథాపూర్ ప్లాంట్‌లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉత్పత్తి తగ్గడంతో మార్జిన్లపై ప్రభావం పడింది’’అని టాటా కెమికల్స్ ఎండీ, సీఈవో ఆర్ ముకందన్ తెలిపారు.మార్చి త్రైమాసికంతో పోల్చితే పనితీరు మొత్తం మీద మెరుగపడినట్టు చెప్పారు. కస్టమర్లను అట్టిపెట్టుకోవడంతోపాటు స్థిరమైన కార్యకలాపాలపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా కెమికల్స్ షేరు 2.41 శాతం క్షీణించి రూ.1,074 వద్ద ముగిసింది. -
టాటా కెమికల్స్- ఆర్‌క్యాపిటల్ జోరు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు వ్యాక్సిన్లు, క్యూ2లో జీడీపీ పురోగతి నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సరికొత్త గరిష్టాల రికార్డులతో ప్రారంభమై హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైవర్సిఫైడ్ కంపెనీ టాటా కెమికల్స్, ఫైనాన్షియల్ రంగ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కెమికల్స్ గ్రూప్ కంపెనీ టాటా కెమికల్స్‌లో ప్రమోటర్లు టాటా సన్స్ తాజాగా వాటాను పెంచుకున్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 1.8 మిలియన్ టాటా కెమికల్స్ షేర్లను టాటా సన్స్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీ 0.71 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 420.92 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 76 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో టాటా కెమికల్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 465కు చేరింది. ప్రస్తుతం 6.7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 42 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు విదేశీ పీఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రుణ చెల్లింపులలో విఫలంకావడం ద్వారా రుణ పరిష్కార(రిజల్యూషన్) స్థితికి చేరిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఓక్టీ క్యాపిటల్, కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, జేసీ ఫ్లవర్ తదితర పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈవోఐను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయానికి(మానిటైజేషన్) డిబెంచర్ హోల్డర్స్ కమిటీతోపాటు.. డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వీటికి కంపెనీ రుణాలలో 93 శాతం వరకూ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 9.50 వద్ద ఫ్రీజయ్యింది. -
టాటా ఉప్పు’... కంపెనీ మారింది!
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్ బేవరేజెస్లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్ లిమిటెడ్ (టీసీఎల్) తెలిపింది. ప్రతీ టాటా కెమికల్ షేరుకు 1.14 టాటా గ్లోబల్ బేవరేజెస్ షేర్లు కేటాయిస్తారు. టాటా కెమికల్స్‌కు చెందిన ఉప్పు, మసాలాలు, పప్పులు తదితర ఆహారోత్పత్తులను టాటా గ్లోబల్ బేవరేజెస్ (టీజీబీఎల్) పరం అవుతాయి. ఆ తర్వాత టీజీబీఎల్ పేరును టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌గా మారుస్తారు. దీంతో రూ.9,099 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అవతరిస్తుంది. ఈ మేరకు టాటా కెమికల్స్, టీజీబీఎల్ కంపెనీల బోర్డులు బుధవారం సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. టాటా కెమికల్స్ నుంచి కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేరు చేసి, టీజీబీఎల్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపాయి. వాటాదారులు, స్టాక్ ఎక్సేంజ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం ఈ వ్యాపార విలీనం జరుగుతుంది. నవ్యత కావాలి... తన ప్రధాన ఉత్పత్తుల విషయంలో టీజీబీఎల్‌కు నవ్యత అవసరమని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మరింత వృద్ధి అవకాశాల కోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరపు టీజీబీఎల్ కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అవకాశాలను సొంతం చేసుకునే విధంగా భవిష్యత్తు విధానాలు ఉండాలని, అందుకు తగిన విధంగా సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఆకాంక్షలను చేరుకునేందుకు శక్తిమంతమైన టాటా బ్రాండ్ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. వృద్ధికి మరింత అవకాశం ఇరు కంపెనీల వినియోగదారుల ఆధారిత వ్యాపారాన్ని ఏకం చేయడం వల్ల ఆహారం, పానీయాల మార్కెట్లో వాటా పెంచుకోవచ్చని, దీనివల్ల రెండు కంపెనీల వాటాదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. టీజీబీఎల్ టాటా టీ, టెట్లే పేరుతో టీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఎయిట్ ఓ క్లాక్ బ్రాండ్ కింద కాఫీని, ఇంకా బాటిల్డ్ వాటర్, గ్లూకోవిటా తదితర ఉత్పత్తులను సైతం మార్కెట్ చేస్తోంది. టాటా కాఫీ కూడా టీజీబీఎల్ అనుబంధ సంస్థే. ఇక టాటా కెమికల్స్ ప్రపంచంలో మూడో అతిపెద్ద సోడా యాష్ తయారీదారు. కన్జ్యూమర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని డీమెర్జ్ చేసిన తర్వాత టాటా కెమికల్స్ పూర్తిగా బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీగా కొనసాగుతుంది. ‘‘ఎఫ్ఎంసీజీ విభాగంలో ఫుడ్, బేవరేజెస్ పరంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్థానం బలపడుతుంది. దేశీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకునేందుకు ఈ విలీనం ద్వారా బలమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాం’’ అని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
టాటా కెమికల్స్ యూరియా వ్యాపార విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా, కస్టమైజ్డ్ ఫెర్టిలైజర్స్ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్ ఈ వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్ ఇండియాకు రూ. 2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్ అమ్మేసింది. నియంత్రణలు అధికంగా ఉన్న యూరియా రంగంలో ఇది తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షరతులు, సూచనల ప్రకారమే ఈ వాటా విక్రయం పూర్తయినట్లు టాటా కెమికల్స్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. కాగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎరువుల మార్కెట్ అయిన భారత్‌లో ప్రవేశించడం ఉత్సాహాన్నిస్తోందని యారా ఇంటర్నేషనల్ సీఈఓ, ప్రెసిడెంట్ స్వీన్ టొరె హొల్‌సెథర్ వ్యాఖ్యానించారు. -
టాటా కెమికల్స్‌కు కొనుగోళ్ల సెగ!
• పనితీరు సరిగా లేకనే నష్టాలు • తరిగిపోయిన ఇన్వెస్టర్ల సంపద • వాటాదారులకు నుస్లీ వాడియా లేఖ ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బోంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా... టాటా కెమికల్స్ నిర్వహణ తీరును తప్పుబట్టారు. పనికిమాలిన విదేశీ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా టాటా కెమికల్స్‌కు నష్టాలు పెరిగిపోయాయని,ఫలితంగా గత పదేళ్లలో సంస్థ నికర రుణ భారం రూ.8,695 కోట్లకు చేరి వాటాదారుల విలువ తరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా కెమికల్స్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న వాడియాను, డైరెక్టర్ పదవిలోఉన్న మిస్త్రీని తప్పించేందుకు ఈ నెల 23న వాటాదారుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నుస్లీ వాడియా టాటా కెమికల్స్ వాటాదారులకు లేఖ రాశారు.ఆందోళన పట్టించుకోలేదు...‘‘2005లో బ్రున్నర్ మోండ్ గ్రూపును కొనుగోలు చేసే ప్రతిపాదనపై నాతోపాటు మరికొందరు బోర్డు సభ్యులు కూడా ఆందోళన తెలిపారు. అయినప్పటికీ ఏకాభిప్రాయం మేరకు కొనుగోలు నిర్ణయం జరిగిపోయింది. సోడాయాష్ తయారీలో ఉన్న ఈ కంపెనీ కార్యకలాపాలు బ్రిటన్, కెన్యా, నెదర్లాండ్స్‌లో విస్తరించి ఉన్నాయి. దీని కొనుగోలుకు రూ.800 కోట్లు వెచ్చించారు. కొనుగోలు చేసిన స్వల్పకాలానికే లాభాల్లో ఉన్న కంపెనీ కాస్తానష్టాల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా రూ.1,600 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దీంతో కంపెనీ బ్రిటన్ వ్యాపారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది’’ అని వాడియా తన లేఖలో వివరించారు. టాటా కెమికల్స్ స్వతంత్రడైరెక్టర్గా తనకు మద్దతు ఇవ్వాలని వాటాదారులను వాడియా కోరారు. కంపెనీ కొనుగోళ్ల విధానాన్ని తప్పుబట్టారు. గత పదేళ్లలో కొనుగోళ్ల వల్ల కంపెనీ రుణాలు రూ.1,827 కోట్ల నుంచి రూ.8,695 కోట్లకు పెరిగాయని...అన్ని పెట్టుబడుల రూపేణా తరిగిపోయిన విలువ రూ.2,000 కోట్లుగా పేర్కొన్నారు.ఆ వాటాలను అమ్మేస్తే రుణవిముక్తి‘‘టాటా కెమికల్స్‌కు పలు టాటా గ్రూపు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో వాటాల విలువ సుమారు రూ.7,200 కోట్లు. లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విలువ రూ.1,300కోట్లు కంటే ఎక్కువ. మొత్తం రూ.8,500 కోట్లు. ఈ వాటాలన్నీ అమ్మేస్తే టాటా కెమికల్స్ రుణాలన్నీ తీరిపోతాయి. రుణ భారాన్ని మోస్తున్న కంపెనీ ఈ వాటాలను కలిగి ఉండడం కేవలం పరోక్షంగా టాటా సన్స్ ఓటింగ్హక్కులు, నియంత్రణను కాపాడేందుకే ’’ అని వాడియా పేర్కొన్నారు.నాపై ఆరోపణలు అవాస్తవం: కంపెనీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యహరించానని టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యంగా పేర్కొన్నారు. టాటా కెమికల్స్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా 35 ఏళ్లుగా ఉన్నాననివాడియా తెలిపారు. -
నస్లీ వాడియాతో టాటాలు బ్రేక్ అప్
ముంబై : దశాబ్దాల తరబడి కొనసాగుతున్న టాటా, వాడియాల స్నేహం ఇక బీటలు వారబోతోంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించిన వివాదం నన్లీ వాడియా, రతన్ టాటాల స్నేహం తెగదెంపుల స్థాయికి వెళ్లింది. నెస్లీ వాడియా, మిస్త్రీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడనే నెపంతో మూడు గ్రూప్ కంపెనీలకు బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న వాడియాను తొలగించాలని టాటాలు పావులు కదుపుతున్నారు. చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ వార్‌గా పేరుగాంచిన టాటా గ్రూప్ వివాదంపై వాడియా కుటుంబసభ్యులు, టాటాలకు వ్యతిరేకమై, సైరస్ మిస్త్రీకి అనుకూలంగా నిలిచారు. కంపెనీ చైర్మన్‌గా మిస్త్రీనే ఉంచాలని మద్దతుపలుకుతూ టాటా కెమెకిల్స్ సీనియర్ స్వతంత్ర డైరెక్టర్ వాడియా తన నిర్ణయం తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన టాటా సన్స్, టాటా కెమికల్స్‌కు, టాటా స్టీల్‌కు, టాటా మోటార్స్‌కు శుక్రవారం నోటీసులు జారీచేసింది. వాడియాను బోర్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది. టాటా గ్రూప్ ఆదేశాలతో టాటా స్టీల్ శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ వాడియా మళ్లీ మిస్త్రీకే అనుకూలంగా నిలిచారు. కాగ, టాటా మోటార్స్ బోర్డు మీటింగ్ నేడు జరుగనుంది. 1981 నుంచి వాడియా, టాటా కెమికల్స్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. 1979 ఆగస్టు నుంచి టాటా స్టీల్ బోర్డులో, 1998 డిసెంబర్ నుంచి టాటా మోటార్స్ బోర్డులో కొనసాగున్నారు. శుక్రవారం జారీచేసిన ఆదేశాలతో, ఈ మూడు కంపెనీలు వాడియాను డైరెక్టర్‌షిప్ నుంచి తొలగించడానికి అసాధారణ బోర్డు సమావేశాలకు పిలుపునిచ్చాయి. కాగ, వాడియాను డైర్టకర్షిప్ నుంచి తొలగించాలంటే, ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ నుంచి టాటా సన్స్ మెజార్జీ సపోర్టును పొందాల్సి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తన తొలగింపుపై టాటా సన్స్ కదుపుతున్న పావులపై వాడియా మండిపడ్డారు. బోర్డుల నుంచి తనను తొలగించడం అసమంజసమని, దశాబ్దాలుగా బోర్డులో సభ్యుడిగా నిర్వహిస్తున్న తనను తొలగించాలంటే, కచ్చితమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వాడియా పేర్కొన్నారు. ఈ వార్‌లో మిస్త్రీ, వాడియాలు ఓ వైపు ఉండగా.. రతన్ టాటా మరోవైపు ఉన్నారని, ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుందని టాటా గ్రూప్‌లో ఓ ప్రముఖ సభ్యుడు వ్యాఖ్యానించారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
ఈజీఎంను ఏర్పాటు చేయండి...
టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్‌కి టాటా సన్స్ ఆదేశం న్యూఢిల్లీ: టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీల బోర్డుల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడానికి టాటా సన్స సిద్ధమౌతోంది. ఆయా కంపెనీల బోర్డుల నుంచి మిస్త్రీ, నుస్లి వాడియాలను తొలగించడానికి ఎక్స్ట్రా-ఆర్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) ఏర్పాటు చేయాలని ఆయా కంపెనీలకు టాటా సన్స తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆయా కంపెనీలు వేర్వేరుగా శుక్రవారం బీఎస్ఈకి నివేదించారుు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీలకు టాటా సన్స హోల్డింగ్ కంపెనీ. టాటా సన్సకి టాటా మోటార్స్‌లో 26.51 శాతం, టాటా కెమికల్స్‌లో 19.35 శాతం, టాటా స్టీల్‌లో 29.75 శాతం వాటాలు ఉన్నారుు. ఇండియన్ హోటల్స్ తర్వాత టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీకి బాసగటా నిలుస్తున్నారు. వాడియా కూడా ఇందులో ఉన్నారు. -
మిస్త్రీకి షాక్ ఇచ్చిన భాస్కర్ భట్
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన సెగలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తాజాగా మిస్త్రీ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడని టాటా గ్రూపు ఆరోపిస్తుండగా, టాటా కెమికల్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ భాస్కర్ భట్ రాజీనామా చేశారు. ఈ మేరకు భట్ బోర్డ్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి ఒక లేఖ రాశారు. అలాగే ఆయన రాజీనామాను తక్షణమే అమల్లోకి వస్తుందని టాటా కెమికల్స్ మార్కెట్ రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో పేర్కొంది. అయితే భాస్కర్ భట్ రాజీనామా చేయడం వ్యక్తిగత వ్యవహారమనీ కంపెనీపై ఆయన రాజీనామా ప్రభావం చూపబోదని టాటా కెమికల్స్ తేల్చి చెప్పింది. బీఎస్ఈ వెబ్సైట్ లో సమాచారం చూసిన తరువాత ఈ నిర్ణయం భట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. మిస్త్రీని ఛైర్మన్ గా కొనసాగించాలన్న టాటా కెమికల్స్ స్వతంత్ర డైరెక్టర్ల నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నాన్నారు. ఎంపిక చేసిన గణాంకాలను మాత్రమే ఉటంకించారని తను వ్యక్తం చేసిన అభిప్రాయాలు భిన్నంగా ఆ ప్రకటన ఉండడంతో తక్షణమే రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇన్నాళ్ల తనపదవీ కాలాన్ని ఎంజాయ్ చేసానన్న భట్ తన పట్ల మిస్త్రీ చూపించిన గౌరవానికి ధన్యవాదాలు తెలిపుతున్నాన్నారు. మరోవైపు భట్ రాజీనామా, టాటా కెమికల్స్ త్రైమాసిక ఫలితా నేపథ్యంలో టాటా కెమికల్స్ పేరు 3 శాతానికిపైగా పడిపోయింది. మొత్తం ఆదాయం రూ 4,213 కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ 3,496.27 కోట్లకు పడిపోయినట్లు సంస్థ ప్రకటించింది. నికర లాభాల్లో స్వల్పంగా పెరిగా రూ 293 కోట్లు తెలిపింది. ఫెర్టిలైజర్ విభాగం నుంచి ఆధాయం తగ్గడం, సేంద్రీ విభాగం నుంచి కూడా రెవెన్యూ క్షీణించడంతోనే.. మొత్తం ఆదాయంలో క్షీణిత కనిపించిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కాగా శుక్రవారం నాటి టాటా కెమికల్స్ బోర్డు సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్లు చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఏకగ్రీవంగా విశ్వాసాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నార్వే యారా చేతికి టాటా కెమికల్స్ యూరియా వ్యాపారం
డీల్ విలువ రూ.2,670 కోట్లు ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఫెర్టిలైజర్స్‌కు విక్రయించనుంది. తమ యూరియా వ్యాపారాన్ని యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించనున్నట్లు టాటా కెమికల్స్ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బర్బల యూరియా ప్లాంట్‌ను యారా కంపెనీకి విక్రయిస్తామని పేర్కొంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులని పేర్కొంది. ఈ డీల్ ఏడాది కాలంలో పూర్తవగలదని అంచనా. -
యూరియా కర్మాగారాల ఏర్పాటు
న్యూఢిల్లీ: కొత్త యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు తాజా ప్రతిపాదలను కేంద్రం ఆహ్వానించింది. దేశంలో యూరియా ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రధాన లక్ష్యంగా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశీయంగా యూరియా ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఇటీవల నోటిఫై అయిన కొత్త యూరియా పెట్టుబడుల విధానం నిర్దేశిస్తోంది. 13 సంస్థలు కొత్తగా ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో ఐఎఫ్ఎఫ్సీఓ, ఆర్సీఎఫ్, టాటా కెమికల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వార్షిక యూరియా డిమాండ్ 30 మిలియన్ టన్నులు. ఉత్పత్తి దాదాపు 22 మిలియన్ టన్నులు. కొత్త ప్లాంట్లకు అనుమతిస్తే, దేశంలో ప్రస్తుతానికి అదనంగా ఉత్పత్తి సామర్థ్యం 16 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.