టాటా కెమికల్స్‌కు కొనుగోళ్ల సెగ!
• పనితీరు సరిగా లేకనే నష్టాలు
• తరిగిపోయిన ఇన్వెస్టర్ల సంపద
• వాటాదారులకు నుస్లీ వాడియా లేఖ
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బోంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా... టాటా కెమికల్స్ నిర్వహణ తీరును తప్పుబట్టారు. పనికిమాలిన విదేశీ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా టాటా కెమికల్స్‌కు నష్టాలు పెరిగిపోయాయని,ఫలితంగా గత పదేళ్లలో సంస్థ నికర రుణ భారం రూ.8,695 కోట్లకు చేరి వాటాదారుల విలువ తరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా కెమికల్స్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న వాడియాను, డైరెక్టర్ పదవిలోఉన్న మిస్త్రీని తప్పించేందుకు ఈ నెల 23న వాటాదారుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నుస్లీ వాడియా టాటా కెమికల్స్ వాటాదారులకు లేఖ రాశారు.ఆందోళన పట్టించుకోలేదు...‘‘2005లో బ్రున్నర్ మోండ్ గ్రూపును కొనుగోలు చేసే ప్రతిపాదనపై నాతోపాటు మరికొందరు బోర్డు సభ్యులు కూడా ఆందోళన తెలిపారు.
అయినప్పటికీ ఏకాభిప్రాయం మేరకు కొనుగోలు నిర్ణయం జరిగిపోయింది. సోడాయాష్ తయారీలో ఉన్న ఈ కంపెనీ కార్యకలాపాలు బ్రిటన్, కెన్యా, నెదర్లాండ్స్‌లో విస్తరించి ఉన్నాయి. దీని కొనుగోలుకు రూ.800 కోట్లు వెచ్చించారు. కొనుగోలు చేసిన స్వల్పకాలానికే లాభాల్లో ఉన్న కంపెనీ కాస్తానష్టాల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా రూ.1,600 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దీంతో కంపెనీ బ్రిటన్ వ్యాపారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది’’ అని వాడియా తన లేఖలో వివరించారు. టాటా కెమికల్స్ స్వతంత్రడైరెక్టర్‌గా తనకు మద్దతు ఇవ్వాలని వాటాదారులను వాడియా కోరారు. కంపెనీ కొనుగోళ్ల విధానాన్ని తప్పుబట్టారు.
గత పదేళ్లలో కొనుగోళ్ల వల్ల కంపెనీ రుణాలు రూ.1,827 కోట్ల నుంచి రూ.8,695 కోట్లకు పెరిగాయని...అన్ని పెట్టుబడుల రూపేణా తరిగిపోయిన విలువ రూ.2,000 కోట్లుగా పేర్కొన్నారు.ఆ వాటాలను అమ్మేస్తే రుణవిముక్తి‘‘టాటా కెమికల్స్‌కు పలు టాటా గ్రూపు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో వాటాల విలువ సుమారు రూ.7,200 కోట్లు. లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విలువ రూ.1,300కోట్లు కంటే ఎక్కువ. మొత్తం రూ.8,500 కోట్లు.
ఈ వాటాలన్నీ అమ్మేస్తే టాటా కెమికల్స్ రుణాలన్నీ తీరిపోతాయి. రుణ భారాన్ని మోస్తున్న కంపెనీ ఈ వాటాలను కలిగి ఉండడం కేవలం పరోక్షంగా టాటా సన్స్ ఓటింగ్‌హక్కులు, నియంత్రణను కాపాడేందుకే ’’ అని వాడియా పేర్కొన్నారు.నాపై ఆరోపణలు అవాస్తవం: కంపెనీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యహరించానని టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యంగా పేర్కొన్నారు. టాటా కెమికల్స్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా 35 ఏళ్లుగా ఉన్నాననివాడియా తెలిపారు.