investor wealth
-
టాటా కెమికల్స్‌కు కొనుగోళ్ల సెగ!
• పనితీరు సరిగా లేకనే నష్టాలు • తరిగిపోయిన ఇన్వెస్టర్ల సంపద • వాటాదారులకు నుస్లీ వాడియా లేఖ ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బోంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా... టాటా కెమికల్స్ నిర్వహణ తీరును తప్పుబట్టారు. పనికిమాలిన విదేశీ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా టాటా కెమికల్స్‌కు నష్టాలు పెరిగిపోయాయని,ఫలితంగా గత పదేళ్లలో సంస్థ నికర రుణ భారం రూ.8,695 కోట్లకు చేరి వాటాదారుల విలువ తరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా కెమికల్స్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న వాడియాను, డైరెక్టర్ పదవిలోఉన్న మిస్త్రీని తప్పించేందుకు ఈ నెల 23న వాటాదారుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నుస్లీ వాడియా టాటా కెమికల్స్ వాటాదారులకు లేఖ రాశారు.ఆందోళన పట్టించుకోలేదు...‘‘2005లో బ్రున్నర్ మోండ్ గ్రూపును కొనుగోలు చేసే ప్రతిపాదనపై నాతోపాటు మరికొందరు బోర్డు సభ్యులు కూడా ఆందోళన తెలిపారు. అయినప్పటికీ ఏకాభిప్రాయం మేరకు కొనుగోలు నిర్ణయం జరిగిపోయింది. సోడాయాష్ తయారీలో ఉన్న ఈ కంపెనీ కార్యకలాపాలు బ్రిటన్, కెన్యా, నెదర్లాండ్స్‌లో విస్తరించి ఉన్నాయి. దీని కొనుగోలుకు రూ.800 కోట్లు వెచ్చించారు. కొనుగోలు చేసిన స్వల్పకాలానికే లాభాల్లో ఉన్న కంపెనీ కాస్తానష్టాల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా రూ.1,600 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దీంతో కంపెనీ బ్రిటన్ వ్యాపారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది’’ అని వాడియా తన లేఖలో వివరించారు. టాటా కెమికల్స్ స్వతంత్రడైరెక్టర్గా తనకు మద్దతు ఇవ్వాలని వాటాదారులను వాడియా కోరారు. కంపెనీ కొనుగోళ్ల విధానాన్ని తప్పుబట్టారు. గత పదేళ్లలో కొనుగోళ్ల వల్ల కంపెనీ రుణాలు రూ.1,827 కోట్ల నుంచి రూ.8,695 కోట్లకు పెరిగాయని...అన్ని పెట్టుబడుల రూపేణా తరిగిపోయిన విలువ రూ.2,000 కోట్లుగా పేర్కొన్నారు.ఆ వాటాలను అమ్మేస్తే రుణవిముక్తి‘‘టాటా కెమికల్స్‌కు పలు టాటా గ్రూపు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో వాటాల విలువ సుమారు రూ.7,200 కోట్లు. లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విలువ రూ.1,300కోట్లు కంటే ఎక్కువ. మొత్తం రూ.8,500 కోట్లు. ఈ వాటాలన్నీ అమ్మేస్తే టాటా కెమికల్స్ రుణాలన్నీ తీరిపోతాయి. రుణ భారాన్ని మోస్తున్న కంపెనీ ఈ వాటాలను కలిగి ఉండడం కేవలం పరోక్షంగా టాటా సన్స్ ఓటింగ్హక్కులు, నియంత్రణను కాపాడేందుకే ’’ అని వాడియా పేర్కొన్నారు.నాపై ఆరోపణలు అవాస్తవం: కంపెనీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యహరించానని టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యంగా పేర్కొన్నారు. టాటా కెమికల్స్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా 35 ఏళ్లుగా ఉన్నాననివాడియా తెలిపారు. -
యూరో ప్యాకేజీ ఆశలతో..
♦ ప్రపంచవ్యాప్తంగా ఎగిసిన మార్కెట్లు ♦ క్రూడ్ ర్యాలీ, రూపాయి రికవరీ ప్రభావం ♦ 473 పాయింట్ల లాభంతో 24,436కు సెన్సెక్స్ ♦ 146 పాయింట్ల లాభంతో 7,422కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,03,826 కోట్లకు ఎగిసింది. ముంబై: యూరోజోన్ నుంచి తాజాగా ఉద్దీపన ప్యాకేజీ వస్తుందన్న అంచనాలతో పాటు ముడి చమురు ధరలు రికవరీ కావడంతో ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటుచేసుకుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం 29 నెలల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయి రూపాయి 39 పైసలు లాభపడడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 20 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,400 పాయింట్ల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 473 పాయింట్లు లాభపడి 24,436 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 146 పాయింట్ల (2%)లాభంతో 7,422 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఏడాది అక్టోబర్ 5 తర్వాత ఒక్కరోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఇటీవల బాగా పతనమైన బ్యాంక్, వాహన, ఆయిల్, ఇన్ఫ్రా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, ఈ షేర్లు ఆకర్షణీయ ధరల్లో కొనుగోళ్లు జోరుగా జరగడం సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా మూడో వారమూ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. మార్చికల్లా యూరోప్ కేంద్ర బ్యాంక్ అదనపు ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాల కారణంగా స్టాక్ మార్కెట్ పెరిగిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. 26 సెన్సెక్స్ షేర్లు లాభాల్లోనే.... 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. చిన్న సైజ్ డీజిల్ ఇంజిన్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా 4.5 శాతం ఎగసింది. గెయిల్ 7.9 శాతం, మారుతీ సుజుకీ 5.5%, టాటా స్టీల్ 5.3%, హీరో మోటొకార్ప్ 5.1%, ఎస్బీఐ 4.8%, డాక్టర్ రెడ్డీస్ 4.5%, మహీంద్రా అండ్ మహీంద్రా 4.4%, ఓఎన్జీసీ 4.2%, కోల్ ఇండియా 4% చొప్పున పెరిగాయి. ఎయిర్‌బస్ నుంచి రావలసినవిమానాలు మరింత ఆలస్యమవుతాయనే వార్తలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) షేర్ 19% క్షీణించింది. జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ 5-6 శాతం రేంజ్లో పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే... మార్చి నెలలో జరిగే సమావేశంలో ప్యాకేజీ ఇవ్వాలన్న ఆలోచనలున్నాయని యూరప్ కేంద్ర బ్యాంక్ చీఫ్ మారియో డ్రాఘి వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ముగిశాయి. జపాన్ నికాయ్ 5.6%, షాంఘై కాంపొజిట్ 1.2%, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.8% చొప్పున పెరిగాయి. యూరప్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా ర్యాలీని కొనసాగించాయి. చలితో పెరిగిన చమురు ధరలు అమెరికా, యూరప్‌లో చలి తీవ్రత పెరగడంతో హీటింగ్ ఆయిల్‌కు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ముడి చమురు ధరలు వేడెక్కాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పెరగడంతో రికార్డ్ స్థాయి షార్ట్ పొజిషన్లు కూడా క్రూడ్ ధరలు భగ్గుమనడానికి ఆజ్యం పోశాయని నిపుణులంటున్నారు. కడపటి సమాచారం అందేసరికి బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 6% లాభంతో 31.24 డాలర్లకు, నెమైక్స్ క్రూడ్ 5.8% లాభంతో 31.38 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 3 నెలల్లో ఇదే అతి పెద్ద ర్యాలీ. చైనా బబుల్ బరస్ట్ ! రానున్న రోజుల్లో షార్ట్ కవరింగ్ ర్యాలీలు చోటు చేసుకుంటాయని, అయితే మధ్య కాలానికి నిఫ్టీ 7,000 దిగువకు రాక తప్పదని నిపుణులంటున్నారు. చైనా బబుల్ బద్దలవడానికి సిద్ధంగా ఉందని, సెన్సెక్స్ 20 వేల పాయింట్ల దిగువకు రానున్నదని స్టాక్ మార్కెట్ ప్రఖ్యాత విశ్లేషకులు మార్క్ ఫేబర్ అంటున్నారు. -
జోరుగా షేర్ల సంపద
- గత ఏడాది రూ.28 లక్షల కోట్లకు స్టాక్ మదుపర్ల సంపద - 30 శాతం లాభపడిన సెన్సెక్స్. నిఫ్టీలు - పెరిగిన లిస్టెడ్ కంపెనీల సంఖ్య ముంబై: స్టాక్ మార్కెట్లు గత ఏడాది మంచి రాబడులను ఇచ్చాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద 2014లో రూ.28 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద పెరగడం ఇది వరుసగా నాలుగో ఏడాది. ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్ల సంపద రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది. గత ఏడాది సెన్సెక్స్ 6,329 పాయింట్లు(30 శాతం) లాభపడింది. నిఫ్టీ కూడా 30 శాతం(1,979 పాయింట్లు) లాభపడింది. సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు లాభపడిన సంవత్సరాల్లో గత ఏడాది రెండో స్థానంలో ఉంది. 2009లో సెన్సెక్స్ 7,817 పాయిట్లు లాభపడింది. ఇప్పటి వరకూ ఇదే అధిక వార్షిక లాభదాయకత. రికార్డ్ స్థాయికి సెన్సెక్స్ గత ఏడాది నవంబర్ 28న సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి(28,822 పాయింట్లు)కి చేరింది. స్టాక్ మార్కెట్లలో లిస్టైన కంపెనీల సంఖ్య పెరగడం కూడా ఇన్వెస్టర్ల సంపద పెరగడానికి దోహదపడింది. ప్రస్తుతం ఈ లిస్టెడ్ కంపెనీల సంఖ్య 5,542గా ఉంది. ప్రభుత్వం తెస్తున్న ఆర్థిక సంస్కరణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంపొందిస్తున్నాయని నిపుణులంటున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), ప్రత్యక్ష నగదు బదిలీ, డీజిల్‌పై నియంత్రణ తొలగింపు, కార్మిక చట్టాల సరళీకరణ, బొగ్గు గనుల కేటాయింపు, భూ సేకరణపై ఆర్ఢినెన్స్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం... ఇవన్నీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని బాగా పెంచాయని జైఫిన్ అడ్వైజర్స్ సీఈఓ దేవేంద్ర నెవ్‌గీ పేర్కొన్నారు. కాగా స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,00,396 కోట్లుగా ఉంది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలుగా టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఐటీసీ, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియాలు నిలిచాయి. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు 1,600 కోట్ల డాలర్లు భారత స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది యాక్సిస్ బ్యాంక్ అత్యధిక వృద్ధి సాధించిన షేర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్ షేర్ 94 శాతం వృద్ధి చెందింది. ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, పీఎన్బీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 70-90 శాతం రేంజ్లో రాణించాయి. -
రూ.100 లక్షల కోట్లకు చేరువలో మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళుతున్న నేపథ్యంలో మార్కెట్ విలువసైతం భారీగా పుంజుకుంటోంది. వెరసి బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 100 లక్షల కోట్లకు చేరువైంది. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 96,25,517 కోట్లను తాకింది. మరో రూ. 3.74 లక్షల కోట్లు జమ అయితే రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని చేరుతుంది. గత శుక్రవారానికి ఈ విలువ డాలర్ల రూపేణా 1.58 ట్రిలియన్లకు చేరింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ విలువ మళ్లీ 1.5 ట్రిలి యన్ డాలర్లను తాకగా, తొలిసారి 2007లో ట్రిలియన్ డాలర్ల క్లబ్లో భారత్ మార్కెట్ చేరింది. అయితే మార్కెట్ల పతనంతో 2008 సెప్టెంబర్‌లో మార్కెట్ విలువ పడిపోగా, తిరిగి 2009 మేలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ బాటలో 2013 ఆగస్ట్‌లో మరోసారి మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడినప్పటికీ 2014లో తిరిగి ప్రాభవాన్ని పొందింది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డు సృష్టించింది.