న్యూఢిల్లీ: కొత్త యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు తాజా ప్రతిపాదలను కేంద్రం ఆహ్వానించింది. దేశంలో యూరియా ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రధాన లక్ష్యంగా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దేశీయంగా యూరియా ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఇటీవల నోటిఫై అయిన కొత్త యూరియా పెట్టుబడుల విధానం నిర్దేశిస్తోంది. 13 సంస్థలు కొత్తగా ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో ఐఎఫ్‌ఎఫ్‌సీఓ, ఆర్‌సీఎఫ్, టాటా కెమికల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వార్షిక యూరియా డిమాండ్ 30 మిలియన్ టన్నులు. ఉత్పత్తి దాదాపు 22 మిలియన్ టన్నులు. కొత్త ప్లాంట్లకు అనుమతిస్తే, దేశంలో ప్రస్తుతానికి అదనంగా ఉత్పత్తి సామర్థ్యం 16 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
యూరియా కర్మాగారాల ఏర్పాటు
Published Wed, Nov 5 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement