అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. కానీ వెంటనే లాభాలను తగ్గించుకొని ఫ్లాట్ గా మారిపోయినా మళ్లీ పుంజుకున్నాయి. సెంచరీ లాభాలతో మొదలైన సెన్సెక్స్ ప్రస్తుతం 58 పాయింట్ల లాభంతో 26408వద్ద నిప్టీ 4 పాయింట్ల లాభంతో 8131 వద్ద ట్రేడ్ అవుతూ లాభ నష్టాల ఊగిసలాడుతున్నాయి. నిఫ్టీ 81 వందలకు పైన స్థిరంగా ఉంది. మెటల్ మిడ్ క్యాప్ షేర్లు స్వల్ప లాభాలతో్ ఉన్నాయి.
కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. కాగా సోమవారం నాటిమార్కెట్ లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల విలువ రూ.1436 కోట్లుగా నమోదైంది. మరోవైపు నిన్న మార్కెట్ ముగిసినతరువాత టాటా స్టీల్ చేసిన ఒప్పంద ప్రకటన నేపథ్యంలో మదుపర్లు ఈ షేర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.