
టాటా స్టీల్ ఉద్యోగులకు శుభవార్త!
జంషెడ్ పూర్: ప్రయివేట్ స్టీల్ మేజర్ టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బోనస్ చెల్లించడానికి నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులందరికీ బోనస్ గా రూ.130 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. ఈ మేరకు కంపెనీ, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించిన మెమోరాండంపై ఇరువర్గాలు సోమవారం సంతకం చేసినట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో జంషెడ్ పూర్ లోని ట్యూబ్స్ డివిజన్ కు చెందిన 15,575 ఉద్యోగులకు రూ 75.77 కోట్లు పంపిణీ చేయబడుతుందనీ, అలాగే కనీసంగా రూ.16,800లు, గరిష్టంగా రూ.12,1365 లను ఆయా ఉద్యోగులకు చెల్లించనున్నట్టు వెల్లడించింది.
1965 బోనస్ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి అధిక వేతనాలు తీసుకుంటున్నప్పటికీ అందరికీ బోనస్ చెల్లిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఒప్పంద పత్రంపై టీవీ నరేంద్రన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, (భారతదేశం, దక్షిణ తూర్పుఆసియా), ఆనంద్ సేన్ అధ్యక్షుడు, త్రిపాఠ్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ అధికారులు, వర్కర్స్ యూనియన్ తరపున,బీకే దిండా,రవి ప్రసాద్, సంజీవ్ కె చౌదరి తదితరులు సంతకాలు చేశారు.