సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్‌ | Tata Steel CEO TV Narendran takes over as CII President | Sakshi
Sakshi News home page

సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్‌

Published Tue, Jun 1 2021 1:39 AM | Last Updated on Tue, Jun 1 2021 1:39 AM

Tata Steel CEO TV Narendran takes over as CII President - Sakshi

న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22 సంవత్సరానికిగాను టాటా స్టీల్‌ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్‌ నియమితులయ్యారు. 2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్‌ డెసిగ్నేట్‌గా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎండీ సంజీవ్‌ బజాజ్‌ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్‌ చైర్మన్, సీఈవో పవన్‌ ముంజాల్‌ బాధ్యతలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement