
చిన్న స్టీల్ కంపెనీలపై ప్రభావం: టాటా స్టీల్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో స్టీల్ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ తెలిపింది. అలాగే, ద్వితీయ శ్రేణి స్టీల్ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. చిన్న మిల్లులు, రోలింగ్ పరిశ్రమలు చేసే వ్యాపారంలో అధిక భాగం నగదు ఆధారితమేనని పేర్కొంది. 60-70 శాతం పొడవైన స్టీల్ ఉత్పత్తుల (లాంగ్ ప్రొడక్ట్స్) వ్యాపార నిర్వహణ ఈ కంపెనీల ఆధ్వర్యంలోనే ఉన్నట్టు పేర్కొంది. కనుక నోట్ల రద్దు నిర్ణయం ఇంటిగ్రేటెడ్, పెద్ద స్థారుు కంపెనీల లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంపై సానుకూల ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ ఇండియా (దక్షిణాసియా విభాగం) ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం సంఘటిత రంగం వైపు వ్యాపారం మళ్లేలా చేస్తుందన్నారు. పెద్ద కంపెనీలు గత కొన్నేళ్లలో లాంగ్ ప్రొడక్ట్స్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాయని, వీటికి సానుకూలమని పేర్కొన్నారు. అధికంగా నగదు లావాదేవీలపై ఆధారపడిన గ్రామీణ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం ఉంటుందని, అరుుతే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే పెద్ద అంశమని భావించడం లేదని, డిమాండ్ వేగంగా పుంజుకుంటుందని నరేంద్రన్ చెప్పారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం ఏ మేర ఉంటుందన్నదాన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్టు తెలిపారు.