న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 9,598 కోట్లను అధిగమించింది.
గతేడాది(2020–21) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,011 కోట్లతో పోలిస్తే ఇది 139 శాతం వృద్ధి. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 45 శాతం జంప్ చేసి రూ.60,843 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో కేవలం రూ. 42,153 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 36,495 కోట్ల నుంచి రూ. 48,666 కోట్లకు పెరిగాయి.
క్యాష్‌ఫ్లో తీరిలా: తాజా సమీక్షా కాలంలో రూ. 2,045 కోట్లమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగినప్పటికీ టాటా స్టీల్ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 6,338 కోట్లకు చేరింది. కోవిడ్–19 మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దీంతో స్టీల్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేశారు.
ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్పంగా 0.7 శాతం బలపడి రూ. 1,174 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment