న్యూఢిల్లీ: దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను (బీఎస్‌ఎల్) కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తయినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. వేలంలో తమ అనుబంధ సంస్థ బామ్నిపాల్ స్టీల్ (బీఎన్‌పీఎల్) ద్వారా భూషణ్ స్టీల్‌లో 72.65 శాతం వాటాలు కొన్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
భూషణ్ స్టీల్ రుణ దాతలకు రూ. 35,200 కోట్ల చెల్లింపు ప్రక్రియను.. ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామని టాటా స్టీల్ వివరించింది. నిర్వహణపరమైన రుణదాతలకు వచ్చే ఏడాది వ్యవధిలో రూ.1,200 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ కొనుగోలు కోసం ఈక్విటీ రూపంలో రూ. 159 కోట్లు, అంతర్–కార్పొరేట్ రుణం కింద రూ.34,974 కోట్లు సమకూర్చుకున్నట్లు టాటా స్టీల్ తెలిపింది. పరిష్కార ప్రణాళిక ప్రకారం బీఎస్‌ఎల్ డైరెక్టర్ల బోర్డులో బీఎన్‌పీఎల్ నామినీలను నియమించినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment