నీతివంతమైన కంపెనీల్లో టాటాస్టీల్, విప్రో
అమెరికా సంస్థ జాబితాలో చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలో నైతికంగా నడుచుకునే అత్యుత్తమ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలకు చోటు లభించింది. అవి ఉక్కు కంపెనీ టాటా స్టీల్, ఐటీ కంపెనీ విప్రో. అమెరికాకు చెందిన ఎతిస్పియర్ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలకు చెందిన 124 కంపెనీలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ కంపెనీలు సమాజంపై ప్రభావం చూపడంతోపాటు వ్యాపార వర్గాల్లో, సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడినవిగా ఎతిస్పియర్ గుర్తించింది.
కంపెనీలు తమ ఉద్యోగులు, వాటాదారులు, కస్టమర్లు, ఇతర బాగస్వాములపై తమ చర్యల ద్వారా చూపించిన ప్రభావం, పరపతి విలువలు, నైతిక సంస్కృతిని పరిగణనలోకి తీసుకున్నట్టు ఎతిస్పియర్ వెల్లడించింది. ఈ జాబితాలోని 124 కంపెనీల్లో 98 అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. వీటిలో 13 కంపెనీలు వరుసగా 13వ సారి ఈ జాబితాకెక్కగా, 8 కంపెనీలకు తొలిసారి చోటు దక్కింది.