best company
-
ప్రపంచంలోనే బెస్ట్ కంపెనీలు!
కంపెనీలతోపాటు ఉద్యోగుల ఎదుగుదలను ప్రామాణికంగా తీసుకుని టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోని వివిధ కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 1000 కంపెనీలు ఉండగా అందులో 22 భారత కంపెనీలకు చోటు దక్కింది.ప్రపంచంలోని బెస్ట్ టాప్ 10 కంపెనీలుయాపిల్యాక్సెంచర్మైక్రోసాఫ్ట్బీఎండబ్ల్యూ గ్రూప్అమెజాన్ఎలక్ట్రిసైట్ డి ఫ్రాన్స్అమెరికన్ ఎక్స్ప్రెస్మెటా ప్లాట్ఫామ్స్సీమెన్స్జేపీ మోర్గాన్చేజ్ఇదీ చదవండి: లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!ఈ జాబితాలోని భారత కంపెనీలు(గ్లోబల్ ర్యాంక్)హెచ్‌సీఎల్ టెక్ 112ఇన్ఫోసిస్ 119విప్రో 134మహీంద్రా గ్రూప్ 187యాక్సిస్ బ్యాంక్ 504ఎస్బీఐ 518ఐసీఐసీఐ బ్యాంక్ 525ఎల్ అండ్ టీ 549ఐటీసీ లిమిటెడ్ 586హీరో మోటోకార్ప్ 597రిలయన్స్ ఇండస్ట్రీస్ 646మదర్సన్ గ్రూప్ 697అదానీ గ్రూప్ 736ఎన్టీపీసీ లిమిటెడ్ 752యెస్ బ్యాంక్ 783 -
LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లింక్డ్ఇన్ ఉత్తమ కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగి్నజెంట్, మక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, డెలాయిట్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ భారత్‌లోని టాప్ కంపెనీల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2024 సంవత్సరానికిగాను టాప్ 25 పెద్ద కంపెనీలతో పాటు ఈసారి టాప్ 15 మధ్యతరహా కంపెనీల అదనపు జాబితాను కూడా చేర్చింది. తదుపరి స్థాయికి వెళ్లే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి కెరీర్లో పురోగతికి దారితీసే ఎనిమిది స్తంభాలపై ఆధారపడి కంపెనీల ర్యాంకింగ్‌లు ఉన్నాయని లింక్డ్ఇన్ తెలిపింది. -
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
2021లో ఇండియాలో టాప్ కంపెనీలు ఇవేనంట
ముంబై : ప్రముఖ లాజిస్టిక్ సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇండియా బెస్ట్ కంపెనీ టూ వర్క్ ఫర్ - 2021గా ఎంపికైంది. ముంబై కేంద్రంగా పని చేస్తోన్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. సర్వే తీరు సంస్థల్లో ఉద్యోగుల అనుభవాలు, ఉద్యోగులతో పని చేయించుకునే క్రమంలో సంస్థ అమలు చేసే విధానాల ఆధారంగా గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వే నిర్వహించేందుకు ఆయా సంస్థలు తమతంట తాముగా ముందుకు వచ్చాయని గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ తెలిపింది. అలా వచ్చిన కంపెనీల నుంచి డేటా తీసుకుని, ఉద్యోగులతో మాట్లాడి... సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ర్యాంకులు ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టాప్‌టెన్ ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వేలో మొదటి స్థానం డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియాకు రాగా.. ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటీవ్స్, ఫార్మ్ ఎక్వీప్మెంట్, ఇన్ట్యూట్ ఇండియా, అయే ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింక్రోని ఇంటర్నేషనల్ సర్వీసెస్, హారిసన్ మళయాళం లిమిటెడ్, సేల్స్ ఫోర్స్, ఎడోబ్ , సిస్కో సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బార్బిక్యూ నేషన్ హస్పిటాలిటీ సంస్థలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. గ్రేట్ ప్లేస్ టూ వర్క్ ముంబై కేంద్రంగా పని చేస్తున్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థకు 60 దేశాల్లో పదివేలకు పైగా కష్టమర్లు ఉన్నారు. ఈ సర్వేపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ... ‘ తమ కంపెనీలు ఉద్యోగుల పనితీరు, ఉద్యోగ యాజమాన్యం మధ్య సంబంధాలు, ఉత్పతాదక పెంచుకోవడం తదితర అంశాలు తెలుసుకునేందుకు వ్యాపార సంస్థలు తమ సేవలు వినియోగించుకుంటాయి’ అని తెలిపారు. చదవండి : ఇటు గూగుల్.. అటు జియో... మధ్యలో 5జీ -
ఉద్యోగులు మెచ్చే కంపెనీలు ఇవే!
లండన్ : ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు’ అని అంటారు. అది మూటా ముళ్లె మోసే మోటు పనులకు వర్తిస్తుందేమో కానీ, ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చొని గంటలు గంటలు పనిచేసే వారికి వర్తించకపోవచ్చు! ఉల్లాసంగా పనిచేసే సంస్కృతి ఆఫీసులో ఉండడం, చేసే పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తే చేసే పని పట్ల ఉద్యోగులకు తృప్తి, సంతృప్తి ఉంటుంది. ఏవో కొన్ని కంపెనీల్లో తప్పా ఎక్కువ కంపెనీల్లో ఇలాంటి సంస్కృతి మచ్చుకైనా కనిపించకపోవచ్చు! కంపెనీ యాజమాన్యం ఉత్తమ సంస్కృతిని పాటించడం, ఉద్యోగాలకు తగిన భద్రత, ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అందుకు తగినట్లుగా పదోన్నతులు కల్పించడం, ఉద్యోగులకు ఉల్లాసానికి క్రీడా కార్యక్రమాలతోపాటు అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అన్నింటికన్నా జీత భత్యాలు మెరుగ్గా ఇవ్వడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బ్రిటన్‌లో ఏయే కంపెనీలు ఉత్తమమైనవి? వాటిలో నెంబర్ వన్, నెంబర్ టూ, త్రీ... లు ఏమిటీ? అన్న విషయంలో ఉద్యోగావకాశాలను కల్పించే ప్రముఖ సంస్థ ‘ఇండీడ్’ అధ్యయనం జరిపింది. అనూహ్యంగా రైతులకు క్రిమి సంహారక మందులను విక్రయించే బ్రిటన్‌లోని ‘రెంటోకిల్ ఇన్సియల్’ అనే కంపెకీ నెంబర్ వన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఇలా 25 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేయగా, గతేడాది మొదటి స్థానాన్ని సాధించిన అమెరికా దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. బ్రిటన్‌లో ఉన్న దేశ, విదేశ కంపెనీలకే ఈ అధ్యయనాన్ని పరిమితం చేశారు. వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయలతోపాటు నిపుణుల సమీక్షలను, కంపెనీ పత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా మొదటి ఐదు కంపెనీల్లో నాలుగు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే కాగా, మొదటి పదిలో ఆరు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే. ఉత్తమ ఐదు కంపెనీలో బ్రిటన్‌కు చెందని కంపెనీ ‘ఆపిల్’ అని సులభంగానే గ్రహించవచ్చు. ఆపిల్ బ్రిటన్ బ్రాంచ్‌లో ఆరున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్తమ పాతిక కంపెనీల్లో ఆర్థిక, ఐటీ, గృహోపకార, ఆహార కంపెనీలే కాకుండా వివిధ రకాల కంపెనీలు ఉన్నాయి. ‘ది అగిన్కేర్ గ్రూప్’ మూడో స్థానంలో రాగా, ఆ తర్వాత వరుసగా రెన్ కిచెన్స్, లష్ కాస్మోటిక్స్, ఈ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ), బర్క్లీస్, నండోస్, కుమన్, జేపీ మోర్గాన్ చేజ్, సైమన్స్ ఏజీ, పీడబ్ల్యూసీ, రోల్స్ రాయిస్, ఐ, మార్క్స్ అండ్ స్పెన్సర్, ఐకియా, బక్కావోర్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, జాన్ లెవిస్ అండ్ పార్టనర్స్, వెయిట్రోజ్ అండ్ పార్టనర్స్, ఆర్బీఎస్, క్లార్క్స్, బేసిస్టమ్స్, లాయిడ్స్ బ్యాంక్, ఆర్నాల్డ్స్ క్లార్క్ కంపెనీలు ఎంపికయ్యాయి. -
సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు
గోదావరిఖని: అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డును 2019, మార్చి 8న ముంబైలో ప్రదానం చేయనున్నారు. అవార్డు స్వీకరణకు రావాల్సిందిగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను బెర్క్‌ఫైర్ మీడియా సీఈవో హేమంత్కౌశిక్, వైస్ ప్రెసిడెంట్ ఎమిలీవాల్ష్ ఆహ్వానం పంపించారు. బెర్క్‌ఫైర్ సంస్థవారు ఏటా దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఎంపిక చేసి అవార్డును బహూకరిస్తున్నారు. అద్భుత ప్రగతికి విశిష్ట పురస్కారాలు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంది. కంపెనీ సాధిస్తున్న ప్రగతికి గుర్తింపుగా ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కంపెనీ పొందింది. వీటిలో ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవార్డు, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, ఆసియాస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్‌పర్ఫార్మెన్స్ అవార్డు, బెస్ట్ సేవా అవార్డు వంటివి 2018 సంవత్సరంలో సాధించినవాటిలో ఉన్నాయి. సమష్టి కృషికి గుర్తింపు: సీఎండీ శ్రీధర్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ–2018 అవార్డుకు సింగరేణి ఎంపిక కావడంపై సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతూ అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటోందని, అలాగే తమ సంస్థ కూడా ఆయన మార్గదర్శకత్వంలో సింగరేణీయుల సమష్టి కృషితో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతోందన్నారు. ఈ అవార్డు సంస్థలోని సింగరేణీయుల అందరి సమష్టి కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. -
నీతివంతమైన కంపెనీల్లో టాటాస్టీల్, విప్రో
అమెరికా సంస్థ జాబితాలో చోటు న్యూఢిల్లీ: ప్రపంచంలో నైతికంగా నడుచుకునే అత్యుత్తమ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలకు చోటు లభించింది. అవి ఉక్కు కంపెనీ టాటా స్టీల్, ఐటీ కంపెనీ విప్రో. అమెరికాకు చెందిన ఎతిస్పియర్ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలకు చెందిన 124 కంపెనీలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ కంపెనీలు సమాజంపై ప్రభావం చూపడంతోపాటు వ్యాపార వర్గాల్లో, సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడినవిగా ఎతిస్పియర్ గుర్తించింది. కంపెనీలు తమ ఉద్యోగులు, వాటాదారులు, కస్టమర్లు, ఇతర బాగస్వాములపై తమ చర్యల ద్వారా చూపించిన ప్రభావం, పరపతి విలువలు, నైతిక సంస్కృతిని పరిగణనలోకి తీసుకున్నట్టు ఎతిస్పియర్ వెల్లడించింది. ఈ జాబితాలోని 124 కంపెనీల్లో 98 అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. వీటిలో 13 కంపెనీలు వరుసగా 13వ సారి ఈ జాబితాకెక్కగా, 8 కంపెనీలకు తొలిసారి చోటు దక్కింది. -
ప్రత్యామ్నాయ విద్యుత్‌కు బెస్ట్ ప్రయత్నాలు
ఒప్పందం ప్రకారం టాటా నుంచి సరఫరా కాని విద్యుత్ ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు కంపెనీలతో బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ చర్చలు ప్రారంభించింది. టాటా పవర్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెస్ట్‌కి విద్యుత్ సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బెస్ట్‌కు నగరంలో సుమారు 10 లక్షల మంది వినియోగదారులున్నారు. అందులో 8 లక్షల మంది సాధారణ ప్రజలు, 2 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. 932 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా టాట్ పవర్‌తో బెస్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ టాటా పవర్ యూనిట్ ఆరులో విద్యుత్ సెట్ మూతపడడంతో కంపెనీ కేవలం 550 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. దాంతో బెస్ట్‌కు 383 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఈ కారణంగా బెస్ట్‌కు ఇతర కంపెనీల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇతర కంపెనీలతో చర్చలు. అవసరానికన్నా తక్కువ విద్యుత్ సరఫరా అవుతుండటంతో బెస్ట్ అధికారులు ఇతర కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. విద్యుత్ కొరతను పూర్తి చేయడం కోసం రాష్ట్ర గ్రిడ్, మహా వితరణ, ఇతర ప్రైవేట్ కంపెనీల వద్ద విద్యుత్ కొనుగోలు కోసం సిద్ధమయ్యారు. సంబంధిత కంపెనీలతో చర్చలు కూడా ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమున్నంత మేరకు సరఫరా చేయవచ్చని, వేసవిలో కొరత ఉండబోదని అందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని అధికారులు తెలిపారు. -
బెస్ట్‌పై ‘ఎల్ఈడీ’ భారం
సాక్షి, ముంబై: నగర రహదారులకు ఏర్పాటు చేయనున్న ఎల్ఈడీ విద్యుత్ దీపాల వల్ల బెస్ట్ సంస్థ ఆదాయంపై గండి పడే ప్రమాదం ఏర్పడింది. నగర పరిధిలో బెస్ట్ సంస్థ నుంచి సుమారు 25.24 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇందుకు 283 కోట్లను మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బెస్ట్‌కు చెల్లిస్తుంది. అయితే ఎల్ఈడీ బల్బులు అమర్చడం ద్వారా విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతం తగ్గుతుంది. దీంతో బీఎంసీ ద్వారా బెస్ట్‌కు వచ్చే రెవెన్యూ కూడా 50 శాతం మేర తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వీధిదీపాల ద్వారా బెస్ట్‌కు వచ్చే ఆదాయం లెక్కలు పూర్తిగా తలకిందులు కానున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్)లో వాటిని అమర్చే పనులు పూర్తయ్యాయి. త్వరలోనే నగ ర రహదారులపై అమర్చే పనులు అధికారులు ప్రారంభించనున్నారు. బెస్ట్ నుంచి ముంబైలోని కోలాబా నుంచి సైన్, మహీం వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ దారి పొడవునా సుమారు 40 వేల విద్యుత్ దీపాలతో పాటు, నగర శివార్లలోని లక్షకు పైగా విద్యుత్ దీపాలకు బెస్ట్ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇందుకోసం యూనిట్‌కు రూ.8.90 చొప్పున బెస్ట్‌కు బీఎంసీ చెల్లిస్తుంది. రవాణా శాఖ ద్వారా యూనిట్‌కు రూ.1.52 అదనంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల బెస్ట్ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రస్తుతం బెస్ట్ ఆధీనంలో ఉన్న రవాణా శాఖ తీవ్ర నష్టాల్లో ఉండగా... విద్యుత్ శాఖ మాత్రమే లాభాల్లో ఉంది.