ముంబై : ప్రముఖ లాజిస్టిక్ సంస్థ డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇండియా బెస్ట్ కంపెనీ టూ వర్క్ ఫర్ - 2021గా ఎంపికైంది. ముంబై కేంద్రంగా పని చేస్తోన్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది.
సర్వే తీరు
సంస్థల్లో ఉద్యోగుల అనుభవాలు, ఉద్యోగులతో పని చేయించుకునే క్రమంలో సంస్థ అమలు చేసే విధానాల ఆధారంగా గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వే నిర్వహించేందుకు ఆయా సంస్థలు తమతంట తాముగా ముందుకు వచ్చాయని గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ తెలిపింది. అలా వచ్చిన కంపెనీల నుంచి డేటా తీసుకుని, ఉద్యోగులతో మాట్లాడి... సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ర్యాంకులు ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
టాప్‌టెన్
ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వేలో మొదటి స్థానం డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియాకు రాగా.. ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటీవ్స్, ఫార్మ్ ఎక్వీప్‌మెంట్, ఇన్‌ట్యూట్ ఇండియా, అయే ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింక్రోని ఇంటర్నేషనల్ సర్వీసెస్, హారిసన్ మళయాళం లిమిటెడ్, సేల్స్ ఫోర్స్, ఎడోబ్ , సిస్కో సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బార్బిక్యూ నేషన్ హస్పిటాలిటీ సంస్థలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి.
గ్రేట్ ప్లేస్ టూ వర్క్
ముంబై కేంద్రంగా పని చేస్తున్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థకు 60 దేశాల్లో పదివేలకు పైగా కష్టమర్లు ఉన్నారు. ఈ సర్వేపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ... ‘ తమ కంపెనీలు ఉద్యోగుల పనితీరు, ఉద్యోగ యాజమాన్యం మధ్య సంబంధాలు, ఉత్పతాదక పెంచుకోవడం తదితర అంశాలు తెలుసుకునేందుకు వ్యాపార సంస్థలు తమ సేవలు వినియోగించుకుంటాయి’ అని తెలిపారు.
చదవండి : ఇటు గూగుల్.. అటు జియో... మధ్యలో 5జీ
Comments
Please login to add a commentAdd a comment