DHL
-
‘రాఖీ ఎక్స్ ప్రెస్’ ఆఫర్ ను ప్రారంభించిన బ్లూ డార్ట్
భారతదేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్ పోస్ట్ డీహెచ్ఎల్ గ్రూప్ (డీపీడీహెచ్ఎల్)లో భాగమైన బ్లూ డార్ట్ తన రాఖీ ఎక్స్‌ప్రెస్ ఆఫర్‌ని ప్రారంభించింది. మరోసారి 'కనెక్టింగ్ పీపుల్, లైఫ్స్ ఇంప్రూవింగ్ లైఫ్' అనే తమ నినాదాన్ని వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి వీలుకల్పించే ఈ ఆఫర్, ప్రతి భారతీయ పౌరుడిని రక్షించడానికి కృషి చేస్తున్న కోవిడ్-19 యోధులను అభినందించే, కృతజ్ఞతలు తెలియజేసే లక్ష్యంతో మొదలు పెట్టింది. ప్రత్యేక తగ్గింపు ధర రూ.200కే కోవిడ్ -19 యోధులకు రాఖీ షిప్మెంట్ పంపడానికి లేదా స్వీకరించడానికి ఈ ఆఫర్ అవకాశం కల్పిస్తుంది. దేశీయంగా తమ తోబుట్టువులకు, ప్రియమైనవారికి రాఖీ షిప్మెంట్ పంపే కస్టమర్లకు 0.5 కిలోల బరువు కలిగిన షిప్మెంట్లపై రూ.250/- ప్రత్యేక తగ్గింపు ధర లభిస్తుంది. ప్రియమైనవారు కొన్నిసార్లు విదేశాలలో నివసిస్తారని బ్లూ డార్ట్ అర్థం చేసుకుంది, అందువల్ల, అన్ని అంతర్జాతీయ రాఖీ షిప్మెంట్లపై, కస్టమర్లు టైమ్ డెఫినిట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీతో 0.5 Kg నుండి 2.5 Kg, 5kg, 10kg, 15kg, 20kg మధ్య షిప్మెంట్ల మూల ఛార్జీలపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. ఆఫర్ కాలం జూలై 26, 2021 నుండి ఆగస్టు 23, 2021 వరకు ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ దేశీయ రాఖీ షిప్మెంట్లు బుక్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తమ ఔట్లెట్లలో అద్భుతమైన 'స్లోగన్ కాంటెస్ట్' నిర్వహిస్తోంది. కస్టమర్లు ఒక ఫారమ్ తీసుకొని, "మా కుటుంబం బ్లూడార్ట్ వారి రాఖీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రేమిస్తుంది ఎందుకంటే ...." అన్న సులువైన నినాదాన్ని పూరించాలి. ఈ పోటీలో 10 అత్యంత వినూత్న నినాదాలు పేర్కొన్న వారికి స్మార్ట్ఫోన్లను బహూకరించనుంది. -
2021లో ఇండియాలో టాప్ కంపెనీలు ఇవేనంట
ముంబై : ప్రముఖ లాజిస్టిక్ సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇండియా బెస్ట్ కంపెనీ టూ వర్క్ ఫర్ - 2021గా ఎంపికైంది. ముంబై కేంద్రంగా పని చేస్తోన్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. సర్వే తీరు సంస్థల్లో ఉద్యోగుల అనుభవాలు, ఉద్యోగులతో పని చేయించుకునే క్రమంలో సంస్థ అమలు చేసే విధానాల ఆధారంగా గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వే నిర్వహించేందుకు ఆయా సంస్థలు తమతంట తాముగా ముందుకు వచ్చాయని గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ తెలిపింది. అలా వచ్చిన కంపెనీల నుంచి డేటా తీసుకుని, ఉద్యోగులతో మాట్లాడి... సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ర్యాంకులు ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టాప్‌టెన్ ఇండియా బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ ఫర్ - 2021 సర్వేలో మొదటి స్థానం డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియాకు రాగా.. ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటీవ్స్, ఫార్మ్ ఎక్వీప్మెంట్, ఇన్ట్యూట్ ఇండియా, అయే ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింక్రోని ఇంటర్నేషనల్ సర్వీసెస్, హారిసన్ మళయాళం లిమిటెడ్, సేల్స్ ఫోర్స్, ఎడోబ్ , సిస్కో సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బార్బిక్యూ నేషన్ హస్పిటాలిటీ సంస్థలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. గ్రేట్ ప్లేస్ టూ వర్క్ ముంబై కేంద్రంగా పని చేస్తున్న గ్రేట్ ప్లేసెస్ టూ వర్క్ సంస్థకు 60 దేశాల్లో పదివేలకు పైగా కష్టమర్లు ఉన్నారు. ఈ సర్వేపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ... ‘ తమ కంపెనీలు ఉద్యోగుల పనితీరు, ఉద్యోగ యాజమాన్యం మధ్య సంబంధాలు, ఉత్పతాదక పెంచుకోవడం తదితర అంశాలు తెలుసుకునేందుకు వ్యాపార సంస్థలు తమ సేవలు వినియోగించుకుంటాయి’ అని తెలిపారు. చదవండి : ఇటు గూగుల్.. అటు జియో... మధ్యలో 5జీ -
ఏ వ్యాక్సిన్ అయినా 5 రోజుల్లో డెలివరీ
న్యూయార్క్: కొరియర్ సర్వీసుల దిగ్గజం డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలో ఏ దేశానికైనా 1 నుంచి 5 రోజుల్లోగా వ్యాక్సిన్లను అందించగలమంటూ తాజాగా పేర్కొంది. తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను డెలివరీ చేయగలమని తెలియజేసింది. మైనస్ 75 డిగ్రీలలోనూ వ్యాక్సిన్ల రవాణాకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు విదేశీ మీడియా పేర్కొంది. కొద్ది నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇటీవల భారీగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకే ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి ఉండటంతో డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ సన్నాహాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!) ఎక్కడి నుంచైనా తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలలో రోజువారీ ప్రాతిపదికన వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ సీఈవో జాన్ పియర్సన్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా ఏదేశం నుంచి ఏదేశానికైనా 1-5 రోజుల వ్యవధిలో డెలివరీలు పూర్తిచేస్తుంటామని తెలియజేశారు. ఈ బాటలో కోవిడ్-19 వ్యాక్సిన్లను సైతం రవాణా చేయగలమని తెలియజేశారు. ఉదాహరణకు జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామయ్ంలో ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో రవాణా చేయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. ఇందుకు కంపెనీకి చెందిన వేర్‌హౌస్‌లు తదితర సప్లై చైన్ నెట్వర్క్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణాలో భాగంగా రీఐసింగ్ స్టేషన్ల ద్వారా రీఐస్ ప్యాకేజ్ చేసేందుకు వసతులున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్లను ఎక్కడినుంచైనా అంటే ప్రభుత్వ గిడ్డంగులు, ఆసుపత్రులు, వ్యక్తులు.. ఇలా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఐదు రోజుల్లో సరఫరా చేయగలమని వివరించారు. గత రెండు దశాబ్దాలుగా మెడికల్ ఎక్స్‌ప్రెస్ పేరుతో క్రిటికల్ ప్రొడక్టులు, మెడికల్ యాక్సెసరీలను రవాణా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు
పనాజి : అంతర్జాతీయ లాజిస్టిక్ సర్వీసులను అందిస్తున్న గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోవాలో జరిగిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఈవెంట్లో తమకు గోల్డ్ పార్టనర్ అవార్డు దక్కినట్టు కంపెనీ తెలిపింది. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొంది. ఈ అవార్డును డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా సీనియర్ మేనేజ్మెంట్ టీమ్, ఎస్వీపీ అండ్ కంట్రీ మేనేజర్(ఇండియా) ఆర్ఎస్ సుబ్రహ్మణియన్, వైస్ ప్రెసిడెంట్(కమర్షియల్) సందీప్ జునేజాలు ఈ అవార్డుతో సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా గరుడవేగ తన సర్వీసులను అందజేస్తుంది. అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, మధ్య ప్రాచ్యతో పాటు 200 ఇతర దేశాల్లో గరుడవేగ నమ్మకమైన సర్వీసు ప్రొవైడర్‌గా ఉందని కంపెనీ తెలిపింది. తమ పాపులర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు ద్వారా ప్రస్తుతం అమెరికాకు ఎకానమీ షిప్పింగ్‌ను కేజీకి రూ.350కే అందజేస్తున్నట్టు గరుడవేగ పేర్కొంది. ఐదు పని దినాల్లోనే డెలివరీని చేస్తున్నట్టు కూడా చెప్పింది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు, పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని మిస్ అయితే, వారికి పండుగ సందర్భంగా స్వదేశం నుంచి కానుకలను, మిఠాయిలను పంపించుకునే సౌకర్యాలను కూడా అందిస్తోంది. గరుడబజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. దక్షిణా భారత దేశంలో పలు ప్రముఖ వర్తకుల వద్ద స్పెషల్ స్వీట్లను, స్నాక్‌లను అందుబాటులో ఉంచింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అద్యార్ ఆనంద భవన్, స్వగృహ, పుల్లా రెడ్డి, వెల్లంకి, శ్రీదేవి వంటి ప్రముఖ వర్తకుల నుంచి వీటిని అందరజేస్తోంది. -
ఆ 25 కంపెనీల్లో 10 మనవే
ఆసియా ఖండంలో ఉద్యోగానికి అనువైన 25 పెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి 10 సంస్థలు స్థానం పొందాయి. వీటిల్లో లుపిన్, ఎం అండ్ ఎం, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతపు ఉద్యోగానికి అనువైన ఉత్తమ కంపెనీల జాబితా ప్రకారం.. ఆసియాలో ఉద్యోగానికి అనువైన ఉత్తమ బహుళజాతి కంపెనీల కార్యాలయాల విభాగంలో డీహెచ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో ఓమ్నికామ్, గూగుల్, ఈఎంసీ, మారియట్, నెట్‌యాప్, హయత్, మార్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, శాప్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 8 కంపెనీల కార్యాలయాలు భారత్‌లోనివే. చిన్న, మధ్యతరహా కంపెనీల విభాగంలో సేల్స్‌ఫోర్స్, పెద్ద కంపెనీల విభాగంలో అట్లాసియన్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల విభాగంలో భారత్ నుంచి 10 కంపెనీలు స్థానం పొందాయి. వీటిల్లో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, లుపిన్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ మార్షల్, లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్, సిల్వర్ స్పార్క్ అప్పరెల్, ఉజ్జివన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎం అండ్ ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి.