ఆ 25 కంపెనీల్లో 10 మనవే | 10 of the 25 companies in Asia flexible for employment are indian | Sakshi
Sakshi News home page

ఆ 25 కంపెనీల్లో 10 మనవే

Published Fri, Mar 18 2016 8:33 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఆ 25 కంపెనీల్లో 10 మనవే - Sakshi

ఆ 25 కంపెనీల్లో 10 మనవే

ఆసియా ఖండంలో ఉద్యోగానికి అనువైన 25 పెద్ద కంపెనీల జాబితాలో భారత్ నుంచి 10 సంస్థలు స్థానం పొందాయి. వీటిల్లో లుపిన్, ఎం అండ్ ఎం, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతపు ఉద్యోగానికి అనువైన ఉత్తమ కంపెనీల జాబితా ప్రకారం.. ఆసియాలో ఉద్యోగానికి అనువైన ఉత్తమ బహుళజాతి కంపెనీల కార్యాలయాల విభాగంలో డీహెచ్‌ఎల్ అగ్రస్థానంలో ఉంది.


దీని తర్వాతి స్థానంలో ఓమ్నికామ్, గూగుల్, ఈఎంసీ, మారియట్, నెట్‌యాప్, హయత్, మార్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, శాప్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 8 కంపెనీల కార్యాలయాలు భారత్‌లోనివే. చిన్న, మధ్యతరహా కంపెనీల విభాగంలో సేల్స్‌ఫోర్స్, పెద్ద కంపెనీల విభాగంలో అట్లాసియన్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి.

ఇక పెద్ద కంపెనీల విభాగంలో భారత్ నుంచి 10 కంపెనీలు స్థానం పొందాయి. వీటిల్లో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, లుపిన్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్‌ఎంఎస్‌ఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ మార్షల్, లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్, సిల్వర్ స్పార్క్ అప్పరెల్, ఉజ్జివన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎం అండ్ ఎం ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్స్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement