LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్‌ | LinkedIn Top Companies 2024: TCS tops LinkedIn top 25 companies in India | Sakshi
Sakshi News home page

LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్‌

Published Sat, Apr 20 2024 5:52 AM | Last Updated on Sat, Apr 20 2024 5:52 AM

LinkedIn Top Companies 2024: TCS tops LinkedIn top 25 companies in India - Sakshi

లింక్డ్‌ఇన్‌ జాబితాలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లింక్డ్‌ఇన్‌ ఉత్తమ కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగి్నజెంట్, మక్వారీ గ్రూప్, మోర్గాన్‌ స్టాన్లీ, డెలాయిట్‌ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డ్‌ఇన్‌ భారత్‌లోని టాప్‌ కంపెనీల జాబితాను మంగళవారం విడుదల చేసింది.

2024 సంవత్సరానికిగాను టాప్‌ 25 పెద్ద కంపెనీలతో పాటు ఈసారి టాప్‌ 15 మధ్యతరహా కంపెనీల అదనపు జాబితాను కూడా చేర్చింది. తదుపరి స్థాయికి వెళ్లే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి కెరీర్‌లో పురోగతికి దారితీసే ఎనిమిది స్తంభాలపై ఆధారపడి కంపెనీల ర్యాంకింగ్‌లు ఉన్నాయని లింక్డ్‌ఇన్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement