Tata Consultancy Services (TCS)
-
LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లింక్డ్ఇన్ ఉత్తమ కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగి్నజెంట్, మక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, డెలాయిట్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ భారత్‌లోని టాప్ కంపెనీల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2024 సంవత్సరానికిగాను టాప్ 25 పెద్ద కంపెనీలతో పాటు ఈసారి టాప్ 15 మధ్యతరహా కంపెనీల అదనపు జాబితాను కూడా చేర్చింది. తదుపరి స్థాయికి వెళ్లే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి కెరీర్లో పురోగతికి దారితీసే ఎనిమిది స్తంభాలపై ఆధారపడి కంపెనీల ర్యాంకింగ్‌లు ఉన్నాయని లింక్డ్ఇన్ తెలిపింది. -
మరోసారి టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్‌లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదిలో.. గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్‌లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది. దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు ► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది. ► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్‌ను సాధించింది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది. ► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది. ► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు. ► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది. అనిశ్చితిలోనూ లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!
భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ 'టీసీఎస్' (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్‌లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! రిటర్న్ టు ఆఫీస్ TCS కంపెనీలో ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ కూడా మార్చి ఆఖరినాటికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. కంపెనీలో పనిచేసి ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి టీసీఎస్ సిద్ధమైంది. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్‌లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
మరో వివాదంలో టీసీఎస్.. గతంలో ‘లంచాలకు ఉద్యోగాలు’.. మరి ఇప్పుడు
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ మరో వివాదంలో చిక్కకుంది. ఇప్పటికే లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారనే కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్కాంలో సంబంధం ఉన్న 19 మంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే తాజాగా, సంస్థ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తుందంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్క్‌ర్స్ యూనియన్ ‘నైట్స్’ ఫిర్యాదు చేసింది. తగిన నోటీసులు, సంప్రదింపులు లేకుండానే 2వేల మంది ఉద్యోగుల్ని వివిధ నగరాలకు టీసీఎస్ బలవంతంగా బదిలీ చేసి వారికి, వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని నైట్స్ (nites) పేర్కొంది. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన నెల తర్వాత బదిలీ చేసిన ఉద్యోగులు 15 రోజుల్లోగా కేటాయించిన ప్రదేశంలో చేరాలని కోరింది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసిన ఒక నెల తర్వాత ఈ అంశంపై తెరపైకి వచ్చింది. ఆదేశాలు పాటించిన ఉద్యోగులపై చర్యలు పలు నివేదికల ప్రకారం.. ఆగస్ట్ నెల చివరిలో టీసీఎస్‌లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. అందులో ‘ మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం, రెండు వారాల్లో మీకు కేటాయించిన స్థానాలకు వెళ్లాలి’ అని సూచించింది. అంతేకాదు, కంపెనీ పాలసీల ఆధారంగా, ఉద్యోగుల ప్రయాణ, వసతి ఖర్చులను చెల్లిస్తామని చెప్పింది. ఆదేశాల్ని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉద్యోగుల ఫిర్యాదులు దీంతో తమ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమారు 180 మంది ఉద్యోగులు ఐటీ వర్క్‌ర్స్ యూనియన్ నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. ‘సరైన నోటీసు లేదా సంప్రదింపులు లేకుండా బదిలీ చేయమని బలవంతం చేసిందని, దీనివల్ల తమకు, కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని’ ఆరోపించారు. ఉద్యోగుల ఫిర్యాదతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. ఈ సందర్భంగా నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, ‘ఈ బలవంతపు బదిలీలు ఉద్యోగుల ఆర్థిక, కుటుంబ సభ్యులకు ఇబ్బంది, ఒత్తిడి, ఆందోళన వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోలేదు. టీసీఎస్ ఉద్యోగుల హక్కులను ఉల్లంఘిస్తోంది. సిబ్బంది విషయంలో తీసుకున్న చర్యలపై దర్యాప్తు చేయాలని, అనైతిక పద్ధతుల నుండి ఐటీ ఉద్యోగులను రక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని మేం కార్మిక కార్మిక శాఖను కోరాం’ అని చెప్పారు. ఫ్రెషర్స్‌కి వర్తిస్తుంది టీసీఎస్‌లో బదిలీల అంశానికి సంబంధం ఉన్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి మాట్లాడుతూ.. కేటాయించిన ప్రాజెక్ట్‌లను బట్టి అవసరమైన ఉద్యోగులను నిర్దిష్ట స్థానాలకు తరలించమని కంపెనీ కోరుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన ఫ్రెషర్లకు వర్తిస్తుంది. ఇప్పుడు వారిని ప్రాజెక్ట్‌లలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంగీకరించని ఉద్యోగుల్ని కొంతమంది ఉద్యోగులు అంగీకరించి ఇప్పటికే కేటాయించిన స్థానాలకు మారినప్పటికీ, దాదాపు 150-200 మంది ఉద్యోగులు వారి స్థానాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నట్లు సదరు టీసీఎస్ ఉన్నతాధికారి చెప్పారు. వారి సమస్యలు, ఇతర ఇబ్బందుల గురించి సంస్థ హెచ్ఆర్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కానీ, వారికి ఇచ్చిన రెండు వారాల గడువు తర్వాత ఎటువంటి తదుపరి నోటీసులు లేకుండా వారి ఇమెయిల్ యాక్సెస్‌ను రద్దు చేస్తామని అన్నారు. ‘ఇమెయిల్ యాక్సెస్ కోల్పోయిన ఉద్యోగులు ఇకపై హెచ్ఆర్లతో కమ్యూనికేట్ చేయలేరు. అందుకే హెచ్ఆర్లు ఉద్యోగుల్ని వారికి కేటాయించిన ప్రదేశాలకు వెళ్లమని చెబుతున్నారు. లేకపోతే వారు తమ జీతాలు, ఉద్యోగాలను కోల్పోతారని పునరుద్ఘాటించారు. -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్ - ఆనందంలో ఉద్యోగులు..
TCS Salary Hike: ఇప్పటికే చాలా కంపెనీలు శాలరీ హైక్స్ విషయంలో వెనుకడుగులు వేస్తుంటే 'టీసీఎస్' (TCS) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ఫోసిస్ కంపెనీ వేతన పెరుగుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ మీద 200 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపుతున్నప్పటికీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరుని కనపరచిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం జీతాలను పెంచినట్లు తెలిసింది. దీనితో పాటు ప్రమోషన్లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ సెక్సరియా వెల్లడించారు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల క్షీణత తగ్గి 17.8 శాతానికి చేరినట్లు తెలిసింది. కాగా జూన్ 30 నాటికి కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,15,318 మంది. గత మూడు నెలల్లో ఉద్యోగులు 523 మంది పెరిగారు. కాగా ఈ వర్క్ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) కంపెనీ అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వారిని గుర్తించి రివార్డులను సైతం అందిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో టీసీఎస్ మరో సెంటర్: రాజన్న
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్‌లో మరో సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తమకు ఏడు ఉండగా ఇది ఎనిమిదోది కానున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు. సుమారు ఏడు వందల మంది సిబ్బంది సామర్థ్యంతో ఉండే ఈ చిన్న స్థాయి కేంద్రం వచ్చే ఆరేడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రస్తుతం దాదాపు 90,000 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండగా వీరిలో 37.4 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. -
టీసీఎస్ లాభం రూ. 10 వేల కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలకు అనుగుణమైన లాభాలతో రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం 8.4 శాతం పెరిగి రూ. 10,431 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ లాభాలు ఒక త్రైమాసికంలో రూ. 10వేల కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే ప్రథమం. ఇక సమీక్షా కాలంలో ఆదాయం 18 శాతం ఎగిసి రూ. 55,309 కోట్లకు చేరింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 46,867 కోట్ల ఆదాయంపై రూ. 9,624 కోట్ల లాభం నమోదు చేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 10 శాతం, ఆదాయం 5 శాతం పెరిగాయి. ‘మా సర్వీసులకు డిమాండ్ పటిష్టంగా ఉంది. వివిధ విభాగాలు, మార్కెట్లలో లాభదాయకతపరంగా మెరుగైన వృద్ధి నమోదు చేశాం‘ అని సంస్థ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులు ‘సవాళ్లతో‘ కూడుకుని ఉన్నాయని, మరింత ‘అప్రమత్తంగా‘ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి రిస్కుల ప్రభావం కంపెనీపై పడకుండా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తామని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయపరమైన సవాళ్లపై ఆందోళనల కారణంగా క్లయింట్లు దీర్ఘకాలిక డీల్స్‌కు దూరంగా ఉంటున్నారని సీవోవో గణపతి సుబ్రమణియం చెప్పారు. ధరలపరంగా పరిస్థితి స్థిరంగానే ఉందని, రూపా యి క్షీణత కారణంగా ఒత్తిళ్లేమీ లేవని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున టీసీఎస్ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ అక్టోబర్ 18 కాగా, నవంబర్ 7న చెల్లిస్తుంది. ► క్యూ2లో నిర్వహణ మార్జిన్ 1.6% క్షీణించి 24%కి పరిమితమైంది. నాలుగో త్రైమాసికం నాటికి దీన్ని 25%కి పెంచుకోవాలని.. తర్వాత 26–28%కి చేరుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ► విభాగాల వారీగా చూస్తే సమీక్షా కాలంలో రిటైల్, సీపీజీ (కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్) 22.9%, కమ్యూనికేషన్స్.. మీడియా 18.7 శాతం, టెక్నాలజీ .. సర్వీసులు 15.9 శాతం, తయారీ 14.5 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ► కంపెనీ ఆర్డరు బుక్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 400 మిలియన్ డాలర్ల ఒప్పందమే అతి పెద్దది. ► క్యూ2లో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరింది. మహిళా సిబ్బంది వాటా 35.7 శాతంగా ఉంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) జూన్ త్రైమాసికంలో 19.7 శాతంగా ఉండగా క్యూ2లో 21.5 శాతానికి చేరింది. అయితే, ఇది దాదాపు గరిష్ట స్థాయికి చేరినట్లేనని, ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని లక్కడ్ తెలిపారు. టీసీఎస్ షేరు సోమవారం 2% పెరిగి 3,121 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. -
రిటైల్ రంగ దిగ్గజంతో టీసీఎస్ భారీ డీల్
ముంబై: రిటైల్ రంగ దిగ్గజం మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ భారీ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మార్క్స్ అండ్ స్పెన్సర్ మానవ వనరుల కార్యకలాపాలను టీసీఎస్ మార్చనుంది. 70 శాతం ప్రాజెక్ట్ పనులను భారత్ నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూకే, యూరప్ నుంచి రూ.8,000 కోట్ల రిటైల్ వ్యాపారం నమోదవుతుందని సంస్థ భావిస్తోంది. ‘జూన్ త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయి. సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ప్రాజెక్టుల రాకపై కంపెనీ ఆశావహంగా ఉంది. చర్చలు కాంట్రాక్టులుగా మళ్లుతున్న వాటి శాతం మెరుగ్గా ఉంది. డిమాండ్ అల్ టైమ్ హైలో దూసుకెళుతోంది’ అని టీసీఎస్ యూరప్ రిటైల్ హెడ్ అభిజీత్ నియోగి తెలిపారు. చదవండి: Realme Pad X Tablet: రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు! -
క్వాలిఫై కావడమే కష్టం.. అలాంటిది ఏకంగా విన్నర్‌గా! 7 లక్షల ప్రైజ్‌మనీ!
అది ఆషామాషీ పోటీ కాదు. ‘వరల్డ్స్ లార్జెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన పోటీ. ఈసారి 87 దేశాల నుంచి లక్షమందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో మన కుర్రాడు కలష్ గుప్తా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకున్నాడు... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసిఎస్) నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన ‘కోడ్ విట’లో కలష్‌గుప్తా విజేతగా నిలిచాడు. 7.76 లక్షల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. ఐఐటీ–దిల్లీలో కలష్‌గుప్తా థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ‘కోడ్ విట’ గురించి తెలిసినప్పుడు ఆ పోటీలో ఎలాగైనా పాల్గొనాలనే ఉత్సాహం కలష్‌కు కలిగింది, ‘అందులో క్వాలిఫై కావడం కష్టం’ అన్నారు చాలామంది. ‘టఫ్’ అనే ప్రతికూల మాట వింటే చాలు కలష్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరుతాయి. పట్టుదల వచ్చి అదేపనిగా షేక్‌హ్యాండ్ ఇస్తుంది. ‘కోడ్ వీట’ పోటీలో పాల్గొనడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని... ►టాప్కోడర్గా గ్లోబల్ ర్యాంకింగ్ ఇస్తారు ►ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది ►ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టాటా బ్రాండ్ లో ఎగ్జాయిటింగ్ కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ►ప్రపంచవ్యాప్తంగా చేయితిరిగిన కోడర్స్తో పోటీపడే అవకాశం దొరుకుతుంది అస్సలు ఊహించలేదు.. కానీ బరిలోకి దిగిన తరువాత ‘ఏదో ఒక ర్యాంకు వస్తుంది’ అనుకున్నాడుగానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు కలష్. అందుకే ఇది తనను ఆశ్చర్యానందాలకు గురి చేసిన విజయం. సాకెత్(దిల్లీ)లోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న కలష్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ‘ఇష్టం లేని కష్టమైన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే కాదు, మనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు, జ్ఞాపకాలు మన ముందుకు వచ్చి నిలుచుంటాయి. కొన్ని సందర్భాలలోనైతే చదువును వదిలేసి వాటితోనే ప్రయాణిస్తాం. దీనివల్ల బయటికి మనం బాగా కష్టపడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ కష్టం వృథా పోతుంది. అందుకే పుస్తకం పట్టుకున్న తరువాత సబ్జెక్ట్‌కు సంబంధం లేని ఆలోచనలు మన దగ్గరకు రాకుండా చూసుకోవాలి’ అంటున్న కలష్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఇఇ)లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. తాజాగా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు కలష్. ప్రైజ్‌మనీతో పాటు టీసిఎస్ రిసెర్చ్ అండ్ ఇనోవేషన్ సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. ‘బహుమతి, ర్యాంకింగ్ విషయం ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి పోటీలలో పాల్గొనడం వల్ల మన బలాలు, బలహీనతలు మనమే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది’ అంటున్నాడు కలష్. ‘ఫైనల్స్‌కు చేరుకున్న నలుగురు అభ్యర్థులు మొత్తం పది ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేశారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు’ అంటున్నారు టీసిఎస్ ప్రతినిధి. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్’గా చెబుతాడు. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్‌గా చెబుతాడు. చదవండి: Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు! -
టీసీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా ఇంక్రిమెంట్స్..! గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 6 నుంచి 8శాతం మేర జీతాలను పెంచిందని కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫలితాలు సానుకూలంగా ఉండడంతో FY23లో కూడా ఉద్యోగులకు భారీగా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో భారీగా అట్రిషన్ రేటు అత్యధికంగా 17.4 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల వలసలను ఆపేందుకుగాను ఉద్యోగులకు ఈ ఏడాదిలో భారీ స్థాయిలో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు కంపెనీ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో రికార్డులను సృష్టిస్తూ నికరంగా లక్షకు పైగా ఉద్యోగాలను టీసీఎస్ కల్పించింది. ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించేందుకు టీసీఎస్ సిద్దంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. తొలిసారి రికార్డు స్థాయిలో..! గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రకటించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలతో టీసీఎస్ దుమ్మురేపింది. గడిచిన త్రైమాసికంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాలను టీసీఎస్ గడించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి నాలుగో త్రైమాసికంలో రూ. 9,926 నికర ఆదాయాలను ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే...7.4 శాతం వృద్ధిని సాధించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం తొలిసారిగా రూ.50 వేల కోట్లను దాటడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1, 91, 754 కోట్ల ఆదాయన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ. 16.8 శాతం వార్షిక వృద్ధిని టీసీఎస్ ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. చదవండి: దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..! -
దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాప్ ర్యాంకు దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి ఆర్థిక ఫలితాలలో యస్ అనిపించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో తొలిసారి ఆదాయం రూ. 50,000 కోట్ల మైలురాయిని దాటింది. వెరసి క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15.8 శాతం జంప్‌చేసి రూ. 50,591 కోట్లకు చేరింది. ఇక నికర లాభం 7.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,926 కోట్లను తాకింది. అయితే మార్జిన్లు 1.8 శాతం నీరసించి 25.3 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. లేదంటే ఒక త్రైమాసికంలో నికర లాభం రూ. 10,000 కోట్ల మార్క్‌ను అందుకునేదని తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. 25 బిలియన్ డాలర్లు మార్చితో ముగిసిన గతేడాదిలో టీసీఎస్ తొలిసారి 25.7 బిలియన్ డాలర్ల(రూ. 1,91,754 కోట్లు) టర్నోవర్ సాధించింది. ఇది 16.8 శాతం అధికంకాగా.. నికర లాభం 14.8 శాతం ఎగసి రూ. 38,327 కోట్లకు చేరింది. ఆర్డర్‌బుక్ విలువ కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. 46 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,000కు అధిగమించినట్లు తెలియజేసింది. అయితే ఉద్యోగ వలస(అట్రిషన్ రేటు) అత్యధికంగా 17.4 శాతానికి చేరినట్లు తెలియజేసింది. సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలోనే అత్యధికంగా 25.3 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నికరలాభ మార్జిన్లు 19.6 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. నాలుగో బైబ్యాక్ సవాళ్లను అధిగమిస్తూ మరోసారి పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ నిర్వహణ లాభాలు ఆర్జించినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ శేక్సారియా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. క్యూ4లో రిటైల్, సీపీజీ విభాగం 22.1 శాతం, తయారీ 19 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 18.7 శాతం, టెక్నాలజీ సర్వీసులు 18 శాతం, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 12.9 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు వివరించారు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా 18.7 శాతం, ఇంగ్లండ్ 13 శాతం, కాంటినెంటల్ యూరోప్ 10 శాతం, లాటిన్ అమెరికా 20.6 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 7.3 శాతం, భారత్ 7 శాతం, ఆసియా పసిఫిక్ 5.5 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► క్యూ4లో జత కలసిన 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 10 కొత్త క్లయింట్లు. ► 5 కోట్ల డాలర్లకుపైగా విలువైన 19 కస్టమర్లు కంపెనీ చెంతకు. ► 2 కోట్ల డాలర్ల క్లయింట్లు 40, కోటి డాలర్ల కస్టమర్లు 52 చేరిక. ► క్యూ4లో నికరంగా 35,209 మందికి ఉపాధి. ► ఏడాదిలో నికరంగా 1,03,546 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో రికార్డ్. ► మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కాగా.. 35.6 శాతం మంది మహిళలే. ► కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 39,181 కోట్లుకాగా.. రూ. 31,424 కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల ద్వారా వాటాదారులకు చెల్లించింది. ► ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తామన్న సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం. గతేడాది సైతం ఇదే స్థాయిలో లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ లక్ష మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు తెలియజేశారు. రికార్డ్ ఆర్డర్లు క్యూ4లో అత్యధికంగా 3.533 బిలియన్ డాలర్ల ఇంక్రిమెంటల్ రెవెన్యూ అదనంగా జత కలసింది. 11.3 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్టానికి ఆర్డర్‌బుక్ చేరింది. పూర్తి ఏడాదికి 34.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కలిగి ఉన్నాం. కస్టమర్ల వృద్ధికి, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సహకరించడం ద్వారా 15 శాతం వృద్ధితో గతేడాదిని పటిష్టంగా ముగించాం. కంపెనీ చరిత్రలోనే రికార్డు ఆర్డర్ బుక్‌ను సాధించడంతో భవిష్యత్‌లోనూ పురోగతి బాటలో కొనసాగనున్నాం. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 3,699 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,712–3,656 మధ్య ఊగిసలాడింది. చదవండి: వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..! -
టీసీఎస్‌కు గట్టి షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ నిర్ణయం..!
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మార్ట్గేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కంపెనీ షేర్లు భారీ లాభాలను గడించాయి. కాగా ఈ సంస్థల విలీన నిర్ణయం దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్‌ను ఇచ్చింది. టీసీఎస్ స్థానం గల్లంతు..! ఇరు సంస్థల విలీనం నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ సంస్థ టీసీఎస్‌ను అధిగమించి భారత్‌లో రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కల్గిన కంపెనీగా అవతరించనుంది. ఏప్రిల్ 4న ఉదయం 11:15 గంటల నాటికి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కలిసి రూ. 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 13.95 లక్షల కోట్లుగా ఉంది. 18 నెలలు పట్టే అవకాశం..! ఇరు సంస్థల విలీన ప్రక్రియకు రెగ్యులేటరీ నుంచి అనుమతులు రావడానికి సుమారు 18 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విలీన ప్రక్రియ 2023–24 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీనం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా లభించనుంది. ప్రతి 25 హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. చదవండి: హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం.. దూసుకుపోతున్న షేర్ల ధరలు -
వర్క్ ఫ్రం హోంపై టీసీఎస్ వ్యూహం ఇదే..!
కోవిడ్-19 రాకతో రెండేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి తగ్గడంతో ఆయా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే యోచనలో పడ్డాయి. కాగా తాజాగా ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వర్క్ ఫ్రం హోంపై మెగా ప్లాన్‌ను సిద్దం చేసింది. హైబ్రిడ్ మోడ్‌లోకి..! కరోనా పరిస్థితులు కాస్త సర్దుమనగడంతో..దిగ్గజ ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడ్ ద్వారా ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నాయి. ఉద్యోగులు రిమోట్‌గా ఆఫీసులకు వచ్చి పనిచేసే సౌకర్యాలను పలు ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. టీసీఎస్ కూడా హైబ్రిడ్ మోడ్‌లోనే ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తోంది. కాగా తాజాగా టీసీఎస్ తమ ఉద్యోగుల కోసం కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. 25X25 మోడల్, ఆకేషనల్ ఆపరేటింగ్ జోన్స్(OOZ), హాట్ డెస్క్‌లను టీసీఎస్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కోవిడ్ ప్రోటోకాల్స్‌ను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి సంబంధించిన సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ క్రమం తప్పకుండా ఆఫీసులకు వచ్చి పనిచేయడం ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. 25X25 మోడల్..! సుమారు 46 దేశాలలో టీసీఎస్ విస్తరించి ఉంది. రాబోయే నెలల్లో అన్ని గ్లోబల్ కార్యాలయాల్లో యువ ఉద్యోగులతో కళకళలాడాలని కంపెనీ ఎదురుచూస్తోందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ ఫ్యూచరిస్టిక్, పాత్ బ్రేకింగ్ 25X25 మోడల్‌ను స్వీకరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌తో కంపెనీలోని అసోసియేట్స్‌లో 25 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా కార్యాలయం నుంచి పనిచేయాల్సిన అవసరం లేదని.. అంతేకాకుండా ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఆఫీసుల్లో గడపాల్సిన అవసరం లేదనీ కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే 25X25 మోడల్లో చిన్న మెలిక ఒకటి ఉంది. 25X25 మోడల్లో భాగంగా మొదట ఉద్యోగులను భౌతికంగా కార్యాలయాలకు తిరిగి తీసుకురావడం...క్రమంగా వారిని హైబ్రిడ్ వర్క్ మోడల్లోకి వెళ్లేలా చేయడం. ఎజైల్ వర్క్సీట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాడిఫికేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్వీకరించడం ద్వారా కంపెనీ క్రమంగా ఎజైల్ మోడల్‌కి మారుతోంది. ఈ మోడల్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఎజైల్ వర్క్సీట్లను ఏర్పాటు చేసింది. ఈ మోడల్‌తో ఉద్యోగులు ఏదైనా టీసీఎస్ కార్యాలయం నుంచి పని చేయడానికి, తోటి ఉద్యోగులతో పరస్పర చర్చ చేయడానికి అనుమతిస్తుంది. ఇక మరోవైపు ఉద్యోగుల కోసం అదనంగా ఆకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లను టీసీఎస్ ఏర్పాటు చేసింది. ఆకేషనల్ ఆపరేటింగ్ జోన్స్ సహాయంతో కంపెనీ ఉద్యోగులు దేశంలోని ఏ కార్యాలయంలోనైనా తమ సిస్టమ్‌ను ప్లగ్ ఇన్ చేయడానికి, తక్షణమే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తాయి. ఈ విధంగా మెల్లమెల్లగా వర్క్ ఫ్రం హోంతో పాటుగా ఉద్యోగులకు హైబ్రిడ్ మోడల్లోకి పయనించేలా పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. చదవండి: రెండు కోట్లకుపైగా ఇస్తాం..బంపరాఫర్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్..! -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో.. ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది. చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. త్వరలో ఈపాస్పోర్ట్.. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్పోర్ట్కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్పోర్ట్ పూర్తిస్థాయి పేపర్ఫ్రీ డాక్యుమెంట్కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్పోర్ట్కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. -
ఫ్రెషర్లకు టీసీఎస్ భారీ శుభవార్త!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 35,000 మంది గ్రాడ్యుయేట్లను కొత్తగా నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 నియమించుకొనున్నట్లు తెలిపింది. కంపెనీ ఇప్పటికే గత ఆరు నెలల్లో 43,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. టీసీఎస్ క్యూ2లో నికర ప్రాతిపదికన 19,690 మంది ఉద్యోగులను నియమించుకుంది. సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748కు చేరుకుంది.(చదవండి: మీ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ పోయిందా? ఇదిగో ఇలా చేయండి) ఈ ఉద్యోగుల మొత్తం సంఖ్యలో 36.2% మహిళ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస సమస్య) సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9%కి పెరిగింది. ఇది గత త్రైమాసికంలో 8.6%గా ఉంది. ప్రస్తుత అట్రిషన్ స్థాయిల గురించి ఆందోళన చెందుతున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ధోరణి రాబోయే రెండు మూడు త్రైమాసికాల వరకు కొనసాగుతుందని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఇప్పటి వరకు 70% మంది ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నారని, 95% కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేసుకోవడంతో ఉద్యోగులను ఆఫీసుకు తిరిగి తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలను ఆవిష్కరిస్తుంది. పూర్తిగా టీకాలు వేసుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి ఆహ్వానించినట్లు టిసిఎస్ యాజమాన్యం తెలిపింది. -
వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం
Work From Home To Offices: వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు శుభంకార్డ్ వేయాలని కంపెనీలు భావిస్తున్న తరుణంలో.. ఉద్యోగులు మాత్రం కమ్‌బ్యాక్‌కు ససేమీరా చెప్తుండడం కంపెనీలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కమర్షియల్ కార్యకలాపాలు నిలిచిపోగా, బిల్డింగ్‌ల అద్దె చెల్లింపులు, ఇతరత్ర మెయింటెనెన్స్ ఖర్చులతో భారీగా నష్టపోయిన కంపెనీలు.. ఇక మీదట భరించేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాయి. స్వదేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) .. వర్క్‌ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్ని వీలైనంత త్వరగా ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ ఏడాది చివరికల్లా లేదంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ఆఫీసుల్లో ఎంప్లాయిస్ సందడిని పెంచేదిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. థర్డ్ వేవ్ హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా ఉద్యోగులు ఆఫీసుకు రావాలనే ఆసక్తి చూపిస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తోంది కూడా. అంతేకాదు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, శుభ్రతతో కూడిన ఆఫీసు వాతావరణం అందిస్తామని హామీతో పాటు రాబోయే కాలంలో కచ్చితంగా వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేస్తామని ఎంప్లాయిస్‌కు మాట ఇస్తోంది. వాళ్లలా కాకుండా.. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్ హోంకి ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మెయిల్స్ ద్వారా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి రాజీనామాల బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. దీంతో తలొగ్గుతున్న కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్ ఆఫీస్‌ను కొంతకాలం వాయిదా వేయడంతో పాటు ‘జీతం కోత’ కండిషన్ల మీద వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఉద్యోగులకు అనుమతులు ఇస్తున్నాయి. కానీ, టీసీఎస్ ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. రియల్ టైం ఆఫీస్ వర్క్ ద్వారా ఎక్కువ ప్రొడక్టివిటీని సాధించేందుకు మొగ్గు చూపుతోంది. ఉద్యోగుల పట్ల కఠినంగా కాకుండా.. సున్నితంగా వాళ్లను ఆఫీసులకు రప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యాక్సినేషన్ సహా అన్నిరకాల భద్రతల హామీ ఇస్తుండడంతో.. ప్లాన్ సూపర్ సక్సెస్ అవుతోంది. ఇందుకోసం ఐబీఎం తరహా ప్రణాళికను(రాబోయే రోజుల్లో హైబ్రిడ్ విధానం) టీసీఎస్ ఫాలో కావడం విశేషం. ఈ ఐడియా సత్ఫలితాలను ఇస్తుండడంతో మిగతా కంపెనీలు టీసీఎస్ బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నాయి. ► ఉద్యోగ.. ఆరోగ్య భద్రతకు హామీ ► క్రమం తప్పకుండా హైకులు, ఇతర అలవెన్సులు ఇస్తామనే ప్రకటన ► ప్రోత్సాహకాలు, నజరానాలు, అదనంగా టూర్లు, ఫ్యామిలీ ప్యాకేజీ టూర్ల ఆఫర్ ► షిప్ట్‌మేనేజ్‌మెంట్.. ఉద్యోగికి తగ్గట్లు ఫ్లెక్సీబిలిటీ ► ఎప్పటికప్పుడు ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ► వర్క్‌స్పేస్ ప్లానింగ్ ► అత్యవసరమైతే వర్క్‌ఫ్రమ్ హోంకి కొన్నాళ్లపాటు అనుమతి మరోసారి స్పష్టీకరణ టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. వీలైనంత త్వరగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారాయన. అంతేకాదు హైబ్రిడ్ వర్క్ కల్చర్ (25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్ హోం)ను 2025 నుంచి అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాప్‌లో బిల్డింగ్‌లను వేరే వ్యవహారాల కోసం వినియోగించుకోవాలని, ఖర్చులు తగ్గించుకోవాలని టీసీఎస్ భావిస్తోంది. దీనికి కొనసాగింపుగా తాజాగా టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ ప్రకటన చేశారు. థర్డ్ వేవ్ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటూనే.. వర్క్‌ఫ్రమ్‌ఆఫీస్ కార్యాకలాపాల దిశగా ప్రణాళిక సిద్ధం చేశామని, 70-80 శాతం ఉద్యోగులతో ఆఫీసులను నడిపించి తీరతామని చెబుతున్నారాయన. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?(VIDEO) -
Work From Home: కంపెనీల అనూహ్య నిర్ణయం
కరోనా ప్రభావంతో ఇంటి నుంచే పని చేస్తున్న ఉన్న ఉద్యోగులకు.. జనవరి వరకు ఊరట ఇచ్చాయి టెక్ కంపెనీలు కొన్ని. ఈ తరుణంలో థర్డ్ వేవ్ హెచ్చరికల కంటే ముందుగానే ఉద్యోగుల్ని రిమోట్ వర్క్‌కు ఫిక్స్ చేసేశాయి. అయితే భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఈ లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS).. దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతోంది. టీసీఎస్‌కు యాభై దేశాల్లో 250 లొకేషన్లలో ఆఫీసులు ఉన్నాయి. సుమారు ఐదు లక్షల ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో భారత్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మంది కనీసం ఒక్కడోసు వేయించుకున్నారు. ఇదీగాక ఎంప్లాయిస్ ఫీడ్‌బ్యాక్ సర్వేలో సగం మందికిపైగా తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారట. అందుకే ఆఫీసులకు రావాలని కోరుతున్నామని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం చెబుతున్నారు. చదవండి: నో స్మోక్ ప్లీజ్! వీలైనంత త్వరగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారాయన. అయితే హైబ్రిడ్ వర్క్ మోడల్ తమ పరిశీలనలోనూ ఉందని, 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని నడిపించే దిశగా టీసీఎస్ ప్రణాళిక వేస్తోందని, అయితే 2025 వరకు అది అమలు కావొచ్చని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. క్లిక్ చేయండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్ కీలక ప్రకటన కారణాలు.. నిజానికి వర్క్ ఫ్రమ్ హోం విషయంలో టీఎస్ఎస్ ముందు నుంచే ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ తొందర పెడుతోంది. రెండో వేవ్ కంటే ముందు ఒకసారి చాలామంది ఉద్యోగులకు ఆఫీసులకు రావాలంటూ ముందస్తు మెయిల్స్ కూడా పంపింది. ఇక సెకండ్‌వేవ్ ఉధృతి కొంచెం తగ్గాక.. కీలక విభాగాల్లో పని చేసే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేసింది. టీసీఎస్ మాత్రమే కాదు.. విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలన్నింటివి ఇప్పుడు ఇదే బాట. బిల్డింగ్‌ల మేనేజ్మెంట్ ఒక సమస్యగా మారడం, క్యాంటీన్ తదితర సౌకర్యాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయి కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్లను తిరిగి ఎంప్లాయిస్‌తో కళకళలాడించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నిర్ణయం అమలు అవుతుందా? లేదా? అనేది ఉద్యోగుల్లోనూ ఒక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చదవండి: WFM..ఇక ఆఫీసులకు గుడ్‌బై! -
మరో ఘనత సాధించిన టీసీఎస్
దేశంలోని ఐటీ దిగ్గజలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. జూన్ 30 నాటికి టీసీఎస్ మొత్తం శ్రామిక శక్తి 5,09,058కు పెరిగింది. 2021-22 మొదటి మూడు నెలల్లో 20,409 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్న తర్వాత టీసీఎస్ ఐదు లక్షల శ్రామిక శక్తి మైలురాయిని చేరుకుంది. టీసీఎస్ సీఈఓ మాట్లాడుతూ.. " ఇంకా కొత్త నియామకాల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీసీఎస్ శ్రామిక శక్తిలో 36.2 శాతం ఉన్న మహిళలు ఉన్నారు" అని అన్నారు. మొదటి త్రైమాసికంలో కనీసం 4,78,000 మంది ఉద్యోగులకు ఎజిల్ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడింది. అలాగే, 4,07,000 మందికి పైగా కార్మికులకు బహుళ కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 12 నెలల్లో తన ఐటీ సర్వీసెస్ అట్రిషన్ రేటు 8.6 శాతం వద్ద ఉందని, ఇది పారిశ్రామికాంగ అత్యల్పం అని టీసీఎస్ తెలిపింది. 2022 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసిక లాభం 29 శాతం పెరగినట్లు కంపెనీ ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో డిజిటల్ సేవలకు వ్యాపారాల నుంచి అధిక డిమాండ్ రావడం వల్ల లాభాలు వచ్చాయి అని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.7,008 కోట్ల నుంచి రూ.9,008 కోట్లకు పెరిగింది. -
నిరుద్యోగులకు ఐటీ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్..!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని క్యాంపస్‌ల నుంచి 40,000 మందికి పైగా ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. గత ఏడాది 40,000 మందిని నియమించుకున్న కంపెనీ తాజాగా మరింత మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రపంచ మానవ వనరుల చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో నైపుణ్యాలకు కొదవలేదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు భారత్‌లో ఉన్నట్లు టీసీఎస్ సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షలు వల్ల ఈ నియామకాల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగదు అని ఆయన అన్నారు. గత ఏడాది మొత్తం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు ప్రవేశ పరీక్షకు హాజరు అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా, గత ఏడాది అమెరికన్ క్యాంపస్‌ల నుంచి 2,000 మంది ఫ్రెషర్స్ నియమించికున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో ప్రతిభకు కొరత లేదని, భారత్‌లో టెకీల వేతనాలు హేతుబద్ధంగా ఉన్నాయని, అందుకే దేశీ ట్యాలెంట్‌పై గ్లోబల్ కంపెనీలు దృష్టిసారించాయని ఎన్జీ సుబ్రమణ్యం తెలిపారు. భారతీయల ప్రతిభ "అసాధారణమైనది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 20,409 నిమయించుకున్నట్లు తెలిపింది. దీంతో దేశంలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగుల కలిగిన అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించింది. -
టీసీఎస్ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021-22) ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-7 శాతం మేర పెంపు ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించాయి. సుమారు 4.7 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. వేతనాల పెంపు ప్రతిపాదనలను టీసీఎస్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ఆరు నెలల వ్యవధిలో టీసీఎస్ వేతనాలను పెంచడం ఇది రెండోసారి కానుంది. తాజాగా పెంచబోయేది కూడా కలిపితే ఆరు నెలల కాలంలో 12–14 శాతం మేర వేతనాలను పెంచినట్లవుతుంది. (టీవర్క్ ఫ్రం హోమ్ నుంచి క్రమంగా హైబ్రిడ్ పని విధానం వైపు) -
ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో ఉన్న భారత దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్ ఫైనాన్స్–2021 నివేదిక తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్–10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన ప్రతిభ.. ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్ విలువ 3 శాతం తగ్గితే.. టీసీఎస్ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్ ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హైగ్ తెలిపారు. రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తొలి స్థానంలో యాక్సెంచర్.. ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్ ఎగబాకింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. మహమ్మారికి ముందే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సర్వీసెస్‌పై దృష్టిసారించాలన్న ప్రాముఖ్యతను గుర్తించింది. కన్సల్టింగ్, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ సర్వీసెస్ విభాగాల్లో భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగ్నిజెంట్ బ్రాండ్ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్–7, విప్రో–9, టెక్ మహీంద్రా–15వ స్థానానికి వచ్చి చేరాయి. -
టీసీఎస్.. భేష్!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కేక పెట్టించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు కరోనా కల్లోలం ప్రభావం కొనసాగుతున్నా, టీసీఎస్ క్యూ3 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి పోయాయి. గత తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని కంపెనీ పేర్కొంది. ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. రూ.8,701 కోట్ల నికర లాభం.... టీసీఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆదాయం రూ.39,854 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.42,015 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా 5 శాతం వృద్ధిని సాధించింది. ఇక డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం సీక్వెన్షియల్‌గా 5 శాతం వృద్ధితో 57,020 డాలర్లకు పెరిగింది. రూ. 6 మధ్యంతర డివిడెండ్...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.11,184 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో 26.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ3లో 26.6 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ, గత ఐదేళ్లలోనే అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్‌ను ఈ క్యూ3లోనే సాధించింది. నికర మార్జిన్ 20.7 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి. అన్ని విభాగాలూ జోరుగానే.... అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి....7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, రెండు నెలల పిదప వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై సమీక్ష జరుపుతారు. ఆల్‌టైమ్ హైకి టీసీఎస్... మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఇటీవలి కాలంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్ హైను తాకిన ఈ షేర్ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్ 32 శాతం లాభపడింది. ఆశావహంగా కొత్త ఏడాదిలోకి సీజనల్ సమస్యలున్నా ఈ క్యూ3లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించాం. కీలకమైన ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, గతంలో కుదుర్చుకున్న భారీ డీల్స్ సాకారం కావడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఏడాదిలోకి ఆశావహంగా అడుగిడుతున్నాం. గతంలో కంటే మార్కెట్ స్థితి మరింతగా పటిష్టమయింది. డీల్స్, ఆర్డర్లు మరింతగా పెరగడంతో మా విశ్వాసం మరింతగా పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్, ఐఓటీ, క్వాలిటీ ఇంజినీరింగ్అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాట్ఫార్మ్ సర్వీసెస్ల కారణంగా మంచి వృద్ధిని సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, సీఈఓ, టీసీఎస్