ముంబై: రిటైల్ రంగ దిగ్గజం మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ భారీ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మార్క్స్ అండ్ స్పెన్సర్ మానవ వనరుల కార్యకలాపాలను టీసీఎస్ మార్చనుంది. 70 శాతం ప్రాజెక్ట్ పనులను భారత్ నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూకే, యూరప్ నుంచి రూ.8,000 కోట్ల రిటైల్ వ్యాపారం నమోదవుతుందని సంస్థ భావిస్తోంది. ‘జూన్ త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయి.
సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ప్రాజెక్టుల రాకపై కంపెనీ ఆశావహంగా ఉంది. చర్చలు కాంట్రాక్టులుగా మళ్లుతున్న వాటి శాతం మెరుగ్గా ఉంది. డిమాండ్ అల్ టైమ్ హైలో దూసుకెళుతోంది’ అని టీసీఎస్ యూరప్ రిటైల్ హెడ్ అభిజీత్ నియోగి తెలిపారు.
చదవండి: Realme Pad X Tablet: రియల్‌మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు!
Comments
Please login to add a commentAdd a comment