Mark and Spencer
-
రిటైల్ రంగ దిగ్గజంతో టీసీఎస్ భారీ డీల్
ముంబై: రిటైల్ రంగ దిగ్గజం మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ భారీ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మార్క్స్ అండ్ స్పెన్సర్ మానవ వనరుల కార్యకలాపాలను టీసీఎస్ మార్చనుంది. 70 శాతం ప్రాజెక్ట్ పనులను భారత్ నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూకే, యూరప్ నుంచి రూ.8,000 కోట్ల రిటైల్ వ్యాపారం నమోదవుతుందని సంస్థ భావిస్తోంది. ‘జూన్ త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయి. సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ప్రాజెక్టుల రాకపై కంపెనీ ఆశావహంగా ఉంది. చర్చలు కాంట్రాక్టులుగా మళ్లుతున్న వాటి శాతం మెరుగ్గా ఉంది. డిమాండ్ అల్ టైమ్ హైలో దూసుకెళుతోంది’ అని టీసీఎస్ యూరప్ రిటైల్ హెడ్ అభిజీత్ నియోగి తెలిపారు. చదవండి: Realme Pad X Tablet: రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు! -
ఫ్యాషన్ ‘మార్క్’
నగరవాసులకు ఇంటర్నేషనల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు లండన్‌కు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తుల బ్రాండ్ ‘మార్క్ అండ్ స్పెన్సర్’ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలోని 10వ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో గురువారం ప్రారంభించింది. మెన్స్, ఉమెన్స్ వేర్, ఫుట్‌వేర్ వంటి విభిన్న డిజైన్లు ఇక్కడ లభిస్తున్నాయి. వీటితో పాటు స్కిన్‌కేర్, బాడీ, బాత్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా వింటేజ్ కార్లలో ర్యాలీగా వచ్చిన అందాల మోడల్స్‌తో షోరూమ్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. సంస్థ ఎండీ వేణునాయర్, నటి దీక్షాపంత్ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీ ప్లస్