TCS Salary Hike: Good News For TCS Employees Salary Hike Of 12 To 15 Percent - Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. ఇది కదా ఉద్యోగులకు కావాల్సింది!

Jul 12 2023 9:19 PM | Updated on Jul 15 2023 6:45 PM

Good news for tcs employees salary hike 12 to 15 percent - Sakshi

TCS Salary Hike: ఇప్పటికే చాలా కంపెనీలు శాలరీ హైక్స్ విషయంలో వెనుకడుగులు వేస్తుంటే 'టీసీఎస్' (TCS) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ఫోసిస్ కంపెనీ వేతన పెరుగుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ మీద 200 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపుతున్నప్పటికీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

నివేదికల ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరుని కనపరచిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం జీతాలను పెంచినట్లు తెలిసింది. దీనితో పాటు ప్రమోషన్లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ సెక్సరియా వెల్లడించారు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల క్షీణత తగ్గి 17.8 శాతానికి చేరినట్లు తెలిసింది. కాగా జూన్ 30 నాటికి కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,15,318 మంది. గత మూడు నెలల్లో ఉద్యోగులు 523 మంది పెరిగారు. కాగా ఈ వర్క్ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉండటం గమనార్హం.

(ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!)

కంపెనీ అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వారిని గుర్తించి రివార్డులను సైతం అందిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement