ఇండియా టొబాకో లిమిటెడ్ కంపెనీ (ITC) తన ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 62 మంది ఉద్యోగులు ఈ జాబితాలోకి చేరారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24 శాతం ఎక్కువని తెలుస్తోంది.
ప్రస్తుతం కంపెనీలో 350 కంటే ఎక్కువ మంది కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. 2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారి సంఖ్య 282 మంది మాత్రమే. కంపెనీలో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారు నెలకు రూ.9 లక్షల కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఐటీసీ కంపెనీలో చైర్మన్ అండ్ ఎండీ సంజీవ్ వేతనం 49.6 శాతం పెరిగింది. దీంతో ఈయన జీతము రూ. 28.62 కోట్లకు చేరింది. శాలరీ పెరుగుదలకు ముందు (గత ఏడాది) ఈయన వేతనం రూ. 19.12 కోట్లుగా ఉండేది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ వేతనం 52.4 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం రూ. 13.6 కోట్లకు చేరింది. ఈడీలు సుప్రతిమ్ దత్తా, హేమంత్ మాలిక్ జీతాలు కూడా వరుసగా 59 శాతం, 30 శాతం పెరిగాయి. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 24,567గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment