దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు శాలరీ హైక్ చేస్తుంటే.. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosis) మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరగాల్సిన వేతనాల పెంపు ఇప్పటికీ జారకగా పోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, ప్రాజెక్టుల రద్దు.. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ దేశీయ ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించింది. కాగా ఇప్పుడు శాలరీ హైక్ విషయంలో కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఆర్ధిక పరిస్థితి కారణంగానే ఉద్యోగులకు శాలరీలు పెంచలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(ఇదీ చదవండి: అలా చేస్తేనే విజయం వరిస్తుంది.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా)
ప్రతి సంవత్సరం అప్రైజర్స్ వుంటాయని... ఈ సారి మాత్రం ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ రాలేదని ఉద్యోగులు చెబుతున్నట్లు సమాచారం. సాధారణ ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సైతం ఇంకా వేతన పెంపు జరగకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా శాలరీ హైక్ జరగక పోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment