Bad News
-
తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్.. సెన్సార్ అభ్యంతరం
విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్యాడ్‌న్యూజ్'. సినిమా టైటిల్‌కు తగ్గుట్టాగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఇదీ ‘బ్యాడ్ న్యూస్’ అని చెప్పవచ్చు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కించారు. జులై 19న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.'బ్యాడ్‌న్యూజ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, ఇందులో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి మద్య ఉన్న మూడు ఇంటిమేట్ సీన్స్‌ను CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) తొలగించింది. వారిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు కాస్త మితిమీరినట్లు తెలుస్తోంది. అందుకే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కానీ వారిద్దరి కెమిస్ట్రీని కొందరు ప్రశంసించగా, మరికొందరు అభ్యంతరంగా ఉన్నాయిని భావించారు. సెన్సార్ కట్ లిస్ట్ ప్రకారం.. మూడు సన్నివేశాలలో ఒకటి 9 సెకన్లు, రెండవది 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు మొత్తంగా 27 సెకన్ల లిప్‌లాక్ సీన్లను CBFC మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత, బాడ్ న్యూజ్ సినిమాకు CBFC నుండి U/A సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ సర్టిఫికేట్లో సూచించిన విధంగా సినిమా నిడివి 142 నిమిషాలు, ఇది 2 గంటల 22 నిమిషాలకు సమానం. -
కత్రినా కైఫ్‌కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్‌న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ట్రెండింగ్‌లో తృప్తి డిమ్రి ‘బ్యాడ్ న్యూజ్’
యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయింది. తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఒక్క సినిమాతో తన జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. యానిమల్ సినిమా వల్ల అవకాశాలు క్యూ కట్టేశాయ్. దీంతో ముంబైలో కొత్తిల్లు కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె నుంచి ఏ సినిమా వచ్చినా భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో విక్కీ కౌశల్‌కు జంటగా ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అమీ విర్క్ ఇందులో మరో ప్రధాన పాత్రలో నటించాడు.వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ని ఆనంద్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలక్టివ్ సంయుక్తంగా ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. జులై 19న సినిమా విడుదల కానుంది. -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
అమెరికాలో అయ్యో పాపం మన పిల్లలు...
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదు వార్త. వారి పిల్లల్లో చాలామంది 21 ఏళ్లు నిడగానే దేశం వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరి హెచ్4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌కు దశాబ్దాలకు పైగా వెయిటింగ్ జాబితా ఉండటమే ఇందుకు కారణం. వీరి సంఖ్య లక్షకు పైగా ఉంటుందన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల కోసం ఉద్యోగాధారిత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లో ఉన్న భారతీయుల సంఖ్య 10.7 లక్షలకు పైగా ఉంది. ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుంచి ఏటా ప్రాసెస్ చేసే వీసా దరఖాస్తుల సంఖ్యను 7 శాతానికి పరిమితం చేయడం సమస్యను జటిలం చేసింది. ప్రస్తుత వేగంతో మన వాళ్లందరికీ గ్రీన్ కార్డులు రావాలంటే హీన పక్షం 135 ఏళ్లు పడుతుంది. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించేదే హెచ్4 వీసా. ఈ కారణంగా కనీసం 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుందని డిసైడ్ మెయిర్ అనే ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు చేసిన అధ్యయనంలో తేలింది. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. 21 ఏళ్లు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత వాళ్లు హెచ్4 కేటగిరీ కింద అక్కడ ఉండేందుకు వీల్లేదు. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. అవి చాల పరిమిత సంఖ్యలో మాత్రమే దొరుకుతాయి. దొరకని వారంతా అమెరికా వీడాల్సి ఉంటుంది. పిల్లలుగా అమెరికా వెళ్లి, అక్కడే పెరిగి పెద్దయిన వారికి ఇలా తల్లిదండ్రులను వదిలి దేశం వీడటం నరకప్రాయమే. పైగా భారత్ లోని తమ కుటుంబాలతో వారికి పెద్ద బంధాలేవీ ఉండే అవకాశం పెద్దగా ఉండదు. కనుక వెనక్కు వచ్చి ఇక్కడ, ఎలా ఉండాలన్నది మరో పెద్ద సమస్య కాగలదు. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్‌లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్‌ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్‌బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్‌బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్‌సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? -
షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు!
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు శాలరీ హైక్ చేస్తుంటే.. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosis) మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరగాల్సిన వేతనాల పెంపు ఇప్పటికీ జారకగా పోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, ప్రాజెక్టుల రద్దు.. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ దేశీయ ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించింది. కాగా ఇప్పుడు శాలరీ హైక్ విషయంలో కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఆర్ధిక పరిస్థితి కారణంగానే ఉద్యోగులకు శాలరీలు పెంచలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: అలా చేస్తేనే విజయం వరిస్తుంది.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా) ప్రతి సంవత్సరం అప్రైజర్స్ వుంటాయని... ఈ సారి మాత్రం ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ రాలేదని ఉద్యోగులు చెబుతున్నట్లు సమాచారం. సాధారణ ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సైతం ఇంకా వేతన పెంపు జరగకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా శాలరీ హైక్ జరగక పోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సీఈవో సత్య నాదెళ్ల. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు కోత పెట్టిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! ఓ వైపు లేఆఫ్స్ కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి త్రైమాసికాల్లో మైక్రోసాఫ్ట్ మంచి లాభాలనే నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జీతాల పెంపు కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని సీఈవో సత్య నాదెళ్ల తేల్చి చెప్పేశారు. కోవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ సంవత్సరం జీతాల పెంపు ఉండదని, ఈ అనిశ్చిత సమయాల్లో తమ వ్యాపారం, ఉద్యోగుల స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీతాల పెంపు లేనప్పటికీ బోనస్‌లు, స్టాక్ అవార్డుల ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమ ఉద్యోగులకు వృద్ధి, ఎదుగుదలకు అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆన్లైన్ విక్రయాలపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న నేపథ్యంలో రిటైల్ స్టోర్లలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. తొలగింపులు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరిపైనా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ జీతాల పెంపును స్తంభింపజేయడం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంకేతం. ఇటీవలి కాలంలో లేఆఫ్స్, జీతాల పెంపు నిలిపివేత, వేతనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు. జనవరిలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు -
భారత్ టెకీలపై మరో పిడుగు..!
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలపై మరో పెద్ద పిడుగు పడనుంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వర్క్ పర్మిట్ల తొలగింపుతో పాటు హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, తాజా పరిణామాలు మాత్రం వాటిని నిజం చేసే విధంగానే ఉన్నాయి. వీటి ప్రభావం వేలాది మంది భారతీయులపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో బరాక్ ఒబామా హయాంలో హెచ్-1బి వీసాహోల్డర్ల జీవితభాగస్వాముల (భార్య లేదా భర్త)కు అక్కడ పనిచేసేందుకు చట్టం ద్వారా కల్పించిన ఈ అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చిట్టాలో చేర్చుతోంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు చట్టపరంగా పనిచేసేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటివరకు వర్క్ పర్మిట్లు ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే తాజాగా వీటి రద్దు ప్రణాళికలకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తుదిరూపునిస్తోంది. ఈ విషయాన్ని శాసనకర్తలకు (సెనెటర్లు) అమెరికా పౌరసత్వం, వలస సేవల (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్నా వెల్లడించారు. వచ్చే ఆగస్టుకల్లా దీనిని అమల్లోకి తెచ్చే విషయంపై కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ కావచ్చని తెలుస్తోంది. ‘ అమెరికాలో హెచ్-4 డిపెండెంట్ భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు కల్పించే అధికారం రద్దుకు అవసరమైన మార్పులు తీసుకొచ్చే ఫ్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ పాత ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుత ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో అమెరికా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ప్రతిపాదిస్తాం. దీనికి సంబంధించి ఇచ్చే నోటీస్, దానిపై స్పందించేందుకు ఇచ్చే నిర్ణీత కాలంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది ’ అని సిస్నా స్పష్టంచేశారు. గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షకు పైగా హెచ్-4 వీసాహోల్డర్లు లబ్దిపొందారు. హెచ్ 1బి భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు అనుమతినిస్తూ హెచ్-4 వీసాలు ఇచ్చారు. వీరిలో భారత అమెరికన్ల సంఖ్యే ఎక్కువ. అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు పదేళ్లు, అంతకుపైగానే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసా హోల్డర్ల భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు వీలుగా వర్క్ పర్మిట్ల జారీకి ఒబామా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధననే రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్-4 ఏమిటీ ? అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా ద్వారా వర్క్ పర్మిట్ లభిస్తుంది. వీటి ద్వారా మనదేశానికి చెందిన వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్-4 వీసాపై దాదాపు లక్ష మంది వరకు భారతీయులు ఆ దేశంలోనే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలివ్వగా వాటిలో భారతీయులు 1,17,522 మంది (86శాతం), చైనీయులు 4,770 మంది (3 శాతం), మెక్సికన్లు 2,066 మంది (2 శాతం) కి వర్క్‌పర్మిట్లకు అనుమతినిస్తూ పత్రాలు జారీ చేసినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గతేడాది మొదట్లో హెచ్-4 వీసాతో పనిచేసేందుకు అనుమతి పొందిన వారిలో 94 శాతం మంది మహిళలున్నారు. వారిలోనూ భారతీయులు 93 శాతం, చైనా నుంచి కేవలం నాలుగు శాతమే ఉన్నారు. హెచ్-1బి క్రమబద్ధీకరణ విదేశాలకు చెందిన ఉత్తమ మేథాశక్తి, నైపుణ్యాలను ఆకర్షించే లక్ష్యంతో హెచ్-1బి వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఈ వీసాల కోసం మనదేశ టెకీలు అత్యధికంగా పోటీపడుతున్న నేపథ్యంలో వీటి జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా వీసాల జారీ సంఖ్యపై నియంత్రణ, లాటరీ విధానంలో మార్పులకు తెరతీయనుంది. దీనితో పాటు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికే ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక వృత్తి అంటే ఏమిటన్న దానిపై గతంలో ఇచ్చిన నిర్వచనాలకు భిన్నంగా స్పష్టమైన వివరణనిస్తారు. అంటే సాంకేతికంగానూ, ఉన్నత డిగ్రీల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉన్న విదేశీయులకు అవకాశం కల్పిస్తారు. అమెరికన్ ఉద్యోగులు, వారికిచ్చే వేతనాలు పరిరక్షించడంలో భాగంగా ఉద్యోగం, యజమాని, ఉద్యోగి సంబంధాలపై స్పష్టతనిస్తారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మొబైల్ యూజర్లకు డబుల్ షాక్
కోల్ కత్తా : దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను నిర్ణయించేసింది. బంగారంపై రేట్లపై మాత్రమే ఇక తుది నిర్ణయం రావాల్సి ఉంది. జీఎస్టీ అమలుతో ప్రతి యూజర్ చేతిలో ఒక నిత్యావసర వస్తువుగా మారిన మొబైల్ ఫోన్ల ధరలు కాకపుట్టనున్నాయట. ఒక్క మొబైల్ హ్యాండ్ సెట్లు మాత్రమేకాక, మొబైల్ ఫోన్ బిల్స్ కు మోత మోగనున్నాయని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లకు డబుల్ షాకేనని ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ ఇండస్ట్రీని 12 శాతం, టెలికాం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లతో వినియోగత్వం, పెట్టుబడులు తగ్గిపోతాయని మొబైల్ ఫోన్ ఇండస్ట్రి ఆందోళన వ్యక్తంచేస్తోంది. యూజర్లు ఇక తమ నెలవారీ 1000 రూపాయల మొబైల్ బిల్లుకు అదనంగా 30 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న టెలికాం సర్వీసుల పన్ను రేట్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగడంతో ఈ మేరకు మొబైల్ ఫోన్ బిల్లులు భారీగా ఎగియనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రీపెయిడ్ యూజర్ల ఎఫెక్టివ్ టాక్ టైమ్ కూడా తగ్గిపోనుందట. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మొబైల్ ఫోన్లు 4-5 శాతం ఖరీదుగా మారతాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. స్థానికంగా తయారుచేసే డివైజ్ లు కూడా మరింత ఖరీదైనవిగా మారునున్నాయట. జనవరి నుంచి మార్చి కాలంలో భారత్ లో 59 మిలియన్ల మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ లో తెలిసింది. 18 శాతం పన్నుపై టెలికాం ఇండస్ట్రి ఇప్పటికే పెదవి విరిచేసింది. ఇక మొబైల్ ఇండస్ట్రి నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరగడంతో, స్థానిక మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ పడిపోనుందని తెలుస్తోంది. -
సోనీ ఫ్యాన్స్ కు చేదు వార్త!
భారత్ లో సోనీ మొబైల్ ఫ్యాన్స్ కు ఆ కంపెనీ చేదు వార్త వినిపించింది. ఇకపై భారత్, చైనా, అమెరికా మార్కెట్లపై తక్కువ దృష్టి సారించాలని ఇన్వెస్టర్ల సమావేశంలో ఆ కంపెనీ నిర్ణయించింది. ఈ దేశాల్లో సంతృప్తికరమైన రీతిలో అమ్మకాల వృద్ధి నమోదు చేయకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్, చైనా, అమెరికాల్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల వృద్ధి కేవలం 0.3 శాతం మాత్రమే ఉంటుందని సోనీ అంచనావేస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో సోని వ్యాపారాలపై "డీఫోకస్" చేయాలని నిర్ణయించినట్టు రిపోర్టు వెల్లడించాయి. దీంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న ఈ దేశాల్లో సోనీ స్మార్ట్ ఫోన్లను మాత్రం చేదు అనుభవమే ఎదురైనట్టు తెలుస్తోంది. చైనా, భారత్, అమెరికాలతో పాటు బ్రెజిల్ లో సైతం సోనీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయి. సీఏజీఆర్(కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు) స్మార్ట్ ఫోన్ వృద్ధి ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని సోనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎక్కడైతే పుష్టికరమైన పరపతి ఉండి, లాభాలను మెరుగుపరుచుకోగలదో ఆ ప్రాంతాల్లో మాత్రమే సోనీ ఇక ఫోకస్ చేయనుంది. ఉత్పత్తుల బేధంతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని, అధిక ఆధారిత విలువ విభాగాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. ఆసియా(జపాన్ తో కలిపి), యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు రిపోర్టులు వెల్లడించాయి. అదేవిధంగా లాటిన్ అమెరికా, ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో నమోదయ్యే స్థిరమైన వృద్ధిని అలాగే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోనీ ముందటి ఫ్లాగ్ షిప్ ఎక్స్ పీరియా జడ్ సీరిస్ లను రిప్లేస్ చేస్తూ ఎక్స్ పీరియా ఎక్స్ సీరిస్ మొబైల్స్ ఈ ఏడాది మొదట్లో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
అన్నదాతలకు చేదు కబురు