ట్రెండింగ్‌లో తృప్తి డిమ్రి ‘బ్యాడ్ న్యూజ్‌’ | Triptii Dimri Bad Newz Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో తృప్తి డిమ్రి ‘బ్యాడ్ న్యూజ్‌’

Published Sun, Jun 30 2024 4:08 PM | Last Updated on Sun, Jun 30 2024 4:37 PM

Triptii Dimri Bad Newz Official Trailer Out Now

యానిమల్‌ సినిమాతో తృప్తి డిమ్రి యూత్‌ ఫేవరెట్‌ క్రష్‌ అయిపోయింది. తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ ఒక్క సినిమాతో తన జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. యానిమల్‌​ సినిమా వల్ల అవకాశాలు క్యూ కట్టేశాయ్‌. దీంతో ముంబైలో కొత్తిల్లు కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె నుంచి ఏ సినిమా వచ్చినా భారీ కలెక్షన్స్‌ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో విక్కీ కౌశల్‌‌‌‌‌‌‌‌కు జంటగా ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూజ్‌’ చిత్రం రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  అమీ విర్క్‌ ఇందులో మరో ప్రధాన పాత్రలో నటించాడు.

వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఆనంద్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్‌, లియో మీడియా కలక్టివ్‌ సంయుక్తంగా ‘బ్యాడ్ న్యూజ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. జులై 19న సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement