తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్‌.. సెన్సార్‌ అభ్యంతరం | Vicky Kaushal And Tripti Dimri Bad Newz Movie Take Censor Cuts, CBFC Asks To Trim Intimate Scenes | Sakshi
Sakshi News home page

Bad Newz Movie: తృప్తి డిమ్రి, విక్కీ కౌశల్‌.. సెన్సార్‌ అభ్యంతరం

Published Tue, Jul 16 2024 6:10 PM | Last Updated on Tue, Oct 29 2024 4:28 PM

Vicky Kaushal And Tripti Dimri Bad Newz Movie

విక్కీ కౌశల్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్యాడ్‌న్యూజ్‌'. సినిమా టైటిల్‌కు తగ్గుట్టాగానే ఒక వర్గం ప్రేక్షకులకు ఇదీ ‘బ్యాడ్‌ న్యూస్‌’ అని చెప్పవచ్చు. వాస్తవిక సంఘటనల ఆధారంగా  ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఆనంద్‌ తివారీ తెరకెక్కించారు. జులై 19న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్‌, లియో మీడియా కలక్టివ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'బ్యాడ్‌న్యూజ్‌' సినిమా తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. అయితే, ఇందులో విక్కీ కౌశల్‌, తృప్తి డిమ్రి మద్య ఉన్న మూడు ఇంటిమేట్‌ సీన్స్‌ను  CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) తొలగించింది. వారిద్దరి మధ్య ఇంటిమేట్‌ సీన్లు కాస్త మితిమీరినట్లు తెలుస్తోంది. అందుకే వాటికి సెన్సార్‌ అభ్యంతరం చెప్పింది. కానీ వారిద్దరి కెమిస్ట్రీని కొందరు ప్రశంసించగా, మరికొందరు అభ్యంతరంగా ఉన్నాయిని భావించారు.  

సెన్సార్‌ కట్ లిస్ట్ ప్రకారం..   మూడు సన్నివేశాలలో ఒకటి 9 సెకన్లు, రెండవది 10 సెకన్లు, మూడవది 8 సెకన్లు మొత్తంగా 27 సెకన్ల లిప్‌లాక్‌ సీన్లను CBFC మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత, బాడ్ న్యూజ్ సినిమాకు CBFC నుండి U/A సర్టిఫికేట్‌ దక్కింది. సెన్సార్ సర్టిఫికేట్‌లో సూచించిన విధంగా సినిమా నిడివి 142 నిమిషాలు, ఇది 2 గంటల 22 నిమిషాలకు సమానం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement