టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసి వివాదాస్పదంగా మారింది. ఎక్కువ సంఖ్య విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చెక్కబడింది. సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెంచడమే కాకుండా బోనస్ కూడా ప్రకటించింది.
2024 మే 23న పైలెట్ల జీతాలు రూ. 15000 పెంచారు. దీంతో పాటు బోనస్ రూ.1.8 లక్షల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకు నెల జీతాలను రూ. 5000 నుంచి రూ. 15000 వరకు పెంచినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతాల పెంపు లేదు. అయితే వీరికి బోనస్ కింద రూ. 42000 నుంచి రూ. 1.8 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ. 60000 బోనస్ అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్‌లు వరుసగా 1.32 లక్షలు & 1.80 లక్షల బోనస్‌లను పొందనున్నారు. అంతే కాకుండా గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో జరిగిన ఆలస్యానికి పరిహారం కూడా అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. సాలరీ హైక్, బోనస్ వంటివి జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment