ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ | Water Leakage On Air India Flight Video Viral | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్

Published Fri, Dec 1 2023 11:47 AM | Last Updated on Fri, Dec 1 2023 11:59 AM

Water Leakage On Air India Flight Video Viral - Sakshi

వర్షం పడినప్పుడు సాధారణంగా బస్సులోనో లేదా ట్రైన్లలోనో నీరు లోపలి రావడం గమనించి ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో ఎయిర్ ఇండియా విమానంలో నీరు కారడం చూడవచ్చు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియూయో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

జాయిస్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 45 సెకన్ల వీడియోలో.. నీరు విమానం లోపల కారడం చూడవచ్చు. ఆ సమయంలో ప్రయాణికులు చాలావరకు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. నీరు లోపలికి రావడానికి కారణం సాంకేతిక లోపమా? లేదా నిర్వహణలో నిర్లక్ష్యమా అనేది తెలియాల్సి ఉంది.

నవంబర్ 29న ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. లోపలికి వస్తున్న నీటిని ఆపడానికి సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ వీడియోని ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా, మరి కొందరు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఇదీ చదవండి: నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్‌

ఈ వీడియోలో గమనించినట్లయితే.. లోపలికి వస్తున్న నీరు ప్రయాణికుల మీద పడలేదు, అయినప్పటికీ కొందరు ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా ఈ సంఘటన మీద స్పందించకపోవడం గమనార్హం. విమానంలో నీరు కారటం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement