ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్ బోనస్ అండ్ కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు.
(ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?)
నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment