Sanjiv Puri
-
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
దేశీయ వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలున్నాయి - సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే కొద్దీ ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. సీక్వెన్షియల్‌గా కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో భౌగోళికరాజకీయ పరిస్థితుల్లాంటి అంతర్జాతీయ అంశం ప్రధానమైనది కాగా వాతావరణ మార్పు రెండోదని ఆయన వివరించారు. అయితే, మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలని సంజీవ్ పురి తెలిపారు. మరోవైపు, హోటల్ వ్యాపారాన్ని విడగొట్టడం వల్ల ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం ప్రతికూల పనితీరు ప్రభావం కారణంగా జూన్ త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 18,639 కోట్లకు పరిమితం కాగా లాభం మాత్రం 16 శాతం పెరిగి రూ. 5,180 కోట్లకు చేరింది. దేశీయంగా వ్యవసాయ రంగ వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని సంజీవ్ పురి చెప్పారు. ఉత్పాదకత, మార్కెట్ అనుసంధానతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన ఐటీసీ చైర్మన్ వేతనం - ఎన్ని కొట్లో తెలుసా..?
ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్ బోనస్ అండ్ కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు. (ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?) నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది. -
గుడ్‌న్యూస్: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంపై ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుతోందని ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్ 2022లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ విషయాలు వివరించారు. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉందని పురి చెప్పారు. గతంలో దాదాపు అయిదేళ్లలో పెరిగేంత స్థాయిలో ప్రస్తుతం చాలా మటుకు ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని, వినియోగ ధోరణులపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, వర్షపాత ధోరణులను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గానే ఉండబోతోందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడులకు ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పురి తెలిపారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నిధుల లభ్యత, కార్పొరేట్ల ఆదాయాలు మొదలైనవన్నీ బాగున్నాయన్నారు. సామర్థ్యాల వినియోగం కూడా పుంజు కుంటోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడమనేది ఎగుమతులపరంగా ప్రతికూలాంశంగా ఉంటోందని పురి తెలిపారు. ప్రధానంగా దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టే తమ కంపెనీల్లాంటివి ప్రైవేట్ పెట్టుబడులను యథాప్రకారం కొనసాగిస్తున్నాయన్నారు. తయారీ రంగం కీలకమైనదే అయినప్పటికీ మిగతా రంగాల్లోనూ భారత్ పుంజుకోవాలని పురి చెప్పారు. ఆదాయాల స్థాయిలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఐటీసీ సీవోవో గా సంజీవ్ పూరి
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సంజీవ్పూరిని నియమించింది. 1986లో పూరి ఐటీసీలో చేరిన పూరి ప్యాకేజింగ్, అండ్ ప్రింటింగ్ బిజినెస్ లో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవ్ పరి పూర్తి కాలపు డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ బోర్డ్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఈ కి సంస్థ నివేదించింది. జులై 22న నిర్వహించిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈయన నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది . ఈ మేరకు సమాచారాన్ని సంస్థ బీఎస్ఈకు తెలియజేసింది. 53 సంవత్సరాల పూరికి ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. ఐటీసీ సంస్థలో ఆయన చాలా వేగంగా ఎదిగారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన ఫలితాలో ఐటీసీ మెరుగైన ఫలితాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.